విద్యుత్ యూనిట్ల నిర్మాణానికి 10 వేల టన్నుల ఇసుక
ABN , Publish Date - Mar 10 , 2026 | 11:10 PM
జిల్లాలోని అప్పర్, లోయర్ సీలేరులో విద్యుదుత్పాదనలో భాగంగా రెండు కొత్త యూనిట్ల నిర్మాణానికి పది వేల టన్నుల ఇసుకను సేకరించుకోవచ్చునని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ తెలిపారు.
కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ వెల్లడి
పాడేరు, మార్చి 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అప్పర్, లోయర్ సీలేరులో విద్యుదుత్పాదనలో భాగంగా రెండు కొత్త యూనిట్ల నిర్మాణానికి పది వేల టన్నుల ఇసుకను సేకరించుకోవచ్చునని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ తెలిపారు. సీలేరులో కొత్తగా నిర్మించే 115 మెగావాట్ల రెండు కొత్త యూనిట్లకు ఇసుక సేకరణపై అనకాపల్లి కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయం నుంచి మంగళవారం మైనింగ్, రెవెన్యూ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఇసుక సేకరణ క్రమబద్ధీకరించాలని, నిర్దేశించిన రీచ్‌లలోనే ఇసుకను సేకరించాలన్నారు. భారీ నిర్మాణాలైన అప్పర్, లోయర్ సీలేరులో రెండు యూనిట్ల కోసం గుమ్మ, కొత్తగూడెం ప్రాంతాల్లోని రీచ్‌లలో ఇసుకను సేకరించాలన్నారు. కొత్త యూనిట్ల నిర్మాణం నాణ్యతతో పాటు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పీవోలు శ్రీపూజ, స్మరణ్‌రాజ్, శుభం నొక్వాల్, మైనింగ్ ఏడీ ఆనంద్, డీఆర్‌వో అంబేడ్కర్, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఈఈ జి.డేవిడ్‌రాజు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఈఈ టి.కొండయ్యపడాల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.