Share News

- రాష్ర్టానికి పరిశ్రమలు క్యూ

ABN , Publish Date - Mar 01 , 2026 | 01:21 AM

కూటమి ప్రభుత్వ పాలనలో ఏపీలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారని, దీనికి కారణం పెట్టుబడిదారులను రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములుగా చూడడమేనని రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. రాంబిల్లి మండలం సీతపాలెంలో బ్లూ జెట్‌ హెల్త్‌ కేర్‌ ఫార్మా యూనిట్‌కు శనివారం ఆయన శంకుస్థాపన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

- రాష్ర్టానికి పరిశ్రమలు క్యూ
జ్యోతిప్రజ్వలన చేసి బ్లూ జెట్‌ హెల్త్‌ కేర్‌ ఫార్మా యూనిట్‌ శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మంత్రి లోకేశ్‌, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే సుందరపు, సంస్థ యాజమాన్య ప్రతినిధులు

- మంత్రి నారా లోకేశ్‌

- అచ్యుతాపురం సెజ్‌లో భారీ ఔషధ పరిశ్రమ ఏర్పాటుకు అంకురార్పణ

- రూ.2,300 కోట్లతో ఏర్పాటు కానున్న బ్లూ జెట్‌ హెల్త్‌ కేర్‌ ఫార్మా యూనిట్‌కు శంకుస్థాపన

అనకాపల్లి, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి):

కూటమి ప్రభుత్వ పాలనలో ఏపీలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారని, దీనికి కారణం పెట్టుబడిదారులను రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములుగా చూడడమేనని రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. రాంబిల్లి మండలం సీతపాలెంలో బ్లూ జెట్‌ హెల్త్‌ కేర్‌ ఫార్మా యూనిట్‌కు శనివారం ఆయన శంకుస్థాపన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అచ్యుతాపురం- రాంబిల్లి సెజ్‌లో భారీ ఔషధ పరిశ్రమ ఏర్పాటుకు అంకురార్పణ జరిగిందన్నారు. రూ.2,300 కోట్ల మేర పెట్టుబడులు, 1,750 ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఒప్పందం కుదిరిందని తెలిపారు. ప్రత్యేక ఔషధ, ఆరోగ్య సంరక్షణ రంగంలో బ్లూ జెట్‌ పరిశ్రమకు ప్రత్యేక గుర్తింపు ఉన్నందున ప్రభుత్వం 102.48 ఎకరాల భూమిని ఆలస్యం చేయకుండా కేటాయించిందన్నారు. మూడు దశల్లో ఫార్మా కంపెనీని నిర్మించనున్నారన్నారు. తొలుత మంత్రి లోకేశ్‌కు కంపెనీ ప్రతినిధులు, కూటమి నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని శిలాఫలకాన్ని మంత్రి నారా లోకేశ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు ప్రాజెక్టు వివరాలను ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌, ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌, ఏపీఐఐసీ చైర్మన్‌ మంతెన రామరాజు, ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, ఏపీ రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ ప్రగడ నాగేశ్వరరావు, అర్బన్‌, ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పీలా గోవింద సత్యనారాయణ, కాపు సంక్షేమ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మళ్ల సురేంద్ర, డీసీఎంఎస్‌ చైర్మన్‌ కోట్ని బాలాజీ, బ్లూ జెట్‌ హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఛైర్మన్‌ అక్షయ్‌ బన్సారీలాల్‌ అరోరా, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శివెన్‌ అరోరా, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వేణుబాబు, సహ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నరేష్‌ షా, కలెక్టర్‌ విజయకృష్ణన్‌, బ్లూ జెట్‌ హెల్త్‌కేర్‌ బృంద సభ్యులు, ప్రజా ప్రతినిధులు, ఏపీఐఐసీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2026 | 01:21 AM