Share News

ఊరు లేదు.. కానీ ఆ పేరుతో పంచాయతీ!

ABN , Publish Date - Nov 18 , 2026 | 02:32 AM

ఊరు లేదు.. ఆ పేరుతో 15 సంవత్సరాలుగా పంచాయతీ మాత్రం కొనసాగుతోంది! వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ..!

ఊరు లేదు.. కానీ ఆ పేరుతో పంచాయతీ!

ఊరు లేదు.. ఆ పేరుతో 15 సంవత్సరాలుగా పంచాయతీ మాత్రం కొనసాగుతోంది! వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ..! ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని కొటికలపూడి గ్రామం గుండ్లకమ్మ రిజర్వాయర్‌ నిర్మాణంతో ముంపునకు గురైంది. దీంతో కొత్తగా పునరావాస కాలనీ ఏర్పాటైంది. ఆ కాలనీకి వేణుగోపాలపురంగా నామకరణం చేశారు. అప్పటికే కొటికలపూడి పంచాయతీ ఉండగా.. ఆ పరిధిలో ఉన్న గ్రామాలతో పాటు వేణుగోపాలపురం కూడా అంతర్భాగంగా మారింది.

2011లో కొటికలపూడి వాసులు వేణుగోపాలపురానికి తరలివెళ్లటంతో ఆ గ్రామం పూర్తిగా ఖాళీ అయింది. కొటికలపూడి పంచాయతీ పరిధిలో ఆరు గ్రామాలు ఉన్నాయి. మొత్తం 1,861 మంది ఓటర్లు ఉన్నారు. కొటికలపూడి సచివాలయాన్ని వేణుగోపాలపురంలో నిర్మించారు. కొటికలపూడి గ్రామం లేకపోయినా ప్రస్తుతం ఆ పేరుతో గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్‌ పదవి జనరల్‌ మహిళకు రిజర్వ్‌ అయ్యింది.

- అద్దంకి, ఆంధ్రజ్యోతి

Updated Date - Nov 18 , 2026 | 02:32 AM