Share News

నాడు బీసీల గొంతుకోసి.. నేడు మొసలి కన్నీరా!

ABN , Publish Date - Oct 10 , 2026 | 05:39 AM

బడుగు, బలహీన వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుని, వారి రిజర్వేషన్లను 34 నుంచి 24 శాతాని కి ఏకపక్షంగా తగ్గించిన వైసీపీకి బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని కేంద్ర...

 నాడు బీసీల గొంతుకోసి.. నేడు మొసలి కన్నీరా!

  • 17 వేల మందికి స్థానిక పదవులు దూరం చేసింది వైసీపీయే

  • కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌ నాయుడు, అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): బడుగు, బలహీన వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుని, వారి రిజర్వేషన్లను 34 నుంచి 24 శాతాని కి ఏకపక్షంగా తగ్గించిన వైసీపీకి బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌ నాయుడు, అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. శుక్రవారం శ్రీకాకుళంలో మీడియాతో వారు మాట్లాడారు. ‘‘స్థానిక సంస్థల్లో బీసీల పొట్టగొట్టి 17 వేల మందికి రాజకీయ పదవులు దక్కకుండా చేసిన జగన్‌ పార్టీ.. ఇప్పుడు వారిపై ప్రేమ ఉన్నట్లు మొసలికన్నీరు కారుస్తోంది. స్వార్థ రాజకీయాల కోసం, అభివృద్ధిని అడ్డుకోవడం కోసం పదేపదే కోర్టు మెట్టు ఎక్కే వైసీపీ.. నాడు బీసీల రిజర్వేషన్ల జీవోను హైకో ర్టు కొట్టివేసినప్పుడు సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించలేదో ప్రజలకు సమాధానం చెప్పాలి. నాడు బీసీలకు తీరని అన్యాయం జరుగుతుంటే నోరుమెదపని ఆ పార్టీ నేతలు నేడు డ్రామాలాడుతున్నారు. బీసీలకు తిరిగి 34 శాతం రిజర్వేషన్లు కల్పించడమే ఎన్డీయే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. చట్టపరమైన నిబంధనలతో డీలిమిటేషన్‌ పూర్తి చేసి వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాం’’ అని తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 10 , 2026 | 05:39 AM