అంతర్జాతీయ ప్రమాణాలతో గోశాలల అభివృద్ధి
ABN , Publish Date - Sep 27 , 2026 | 04:28 AM
టీటీడీ గోశాలలను జంతు సంక్షేమం, పరిశుభ్రత, భద్రత, సౌకర్యాల పరంగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కోరారు.
రిలయన్స్ సంస్థ వంతారా ప్రతినిధులతో టీటీడీ అదనపు ఈవో
తిరుమల, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): టీటీడీ గోశాలలను జంతు సంక్షేమం, పరిశుభ్రత, భద్రత, సౌకర్యాల పరంగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కోరారు. టీటీడీ గోశాలలను ఉచితంగా అభివృద్ధి చేసేందుకు రిలయన్స్ ఇండస్ర్టీ్‌సకు చెందిన వంతారా సంస్థ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఆ సంస్థ ప్రతినిధులతో తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో అదనపు ఈవో శనివారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి గోశాలలు, జంతు సంరక్షణ కేంద్ర అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదలపై చర్చించారు. ప్రస్తుతం ఉన్న సౌకర్యాలను ఆధునికీకరించడంతో పాటు జంతువులకు మరింత సురక్షితమైన, పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేలా చర్యలు చేపట్టాలని అదనపు ఈవో సూచించారు.
గోశాలల అభివృద్ధిలో భాగంగా గోడలకు టైల్స్ ఏర్పాటు, స్టీల్ నిర్మాణాలకు పెయింటింగ్, పక్షులు, కొత్త స్టెయిన్‌లెన్స్ స్టీల్ గేట్ల ఏర్పాటు పనులకు సమగ్ర ప్రణాళిక రూపొందించినట్టు వంతార సంస్థ ప్రతినిధులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అదనపు ఈవోకు వివరించారు. పశువుల కదలికలకు అనుగుణంగా స్తంభాల మధ్య దూరం, తగినంత గాలి ప్రసరణ ఉండేలా నిర్మించడంతో పాటు మేత, నీటి వసతులు, సరైన డ్రైనేజ్ వ్యవస కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు