డివైడర్‌ను దాటుకొచ్చిన మృత్యువు
ABN , Publish Date - Mar 23 , 2026 | 04:45 AM
ఓ కారు డ్రైవర్ నిద్రమత్తు ముగ్గురి ప్రాణాలను మింగేసింది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం బైపాస్ ఫ్లైఓవర్ వద్ద...
రెండు కార్లను ఢీకొట్టిన మరో కారు.. ముగ్గురు మృత్యువాత.. నలుగురికి తీవ్ర గాయాలు
డ్రైవర్ నిద్రమత్తే కారణం!
తూర్పు గోదావరి జిల్లాలో ఘటన
దేవరపల్లి/ఏలూరు క్రైం, మార్చి 22 (ఆంధ్ర జ్యోతి): ఓ కారు డ్రైవర్ నిద్రమత్తు ముగ్గురి ప్రాణాలను మింగేసింది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం బైపాస్ ఫ్లైఓవర్ వద్ద ఆదివారం ఉదయం 7 గంటలకు ఓ కారు వేగంగా వెళ్తూ.. మరో రెండు కార్లను ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం కథనం ప్రకారం.. కాకినాడకు చెందిన సిరియాదుల సత్యనారాయణ (53), కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామానికి మామిడాల నారాయణమూర్తి (52), మరికొందరు ఎర్రచందనం మొక్కల కోసం ఆదివారం తెల్లవారుజామును కాకినాడ నుంచి ఏలూరు జిల్లా కణిగిరికి యెర్టిగా కారులో బయలు దేరారు. యర్నగూడెం బైపాస్ ఫ్లై ఓవర్ వద్దకు వచ్చేసరికి.. డ్రైవింగ్ చేస్తున్న కాకినాడ సర్పవరం జంక్షన్‌కు చెందిన బల్లా చిట్టిబాబు కారు నడుపుతుండగా.. నిద్రమత్తులో అదుపుతప్పి డివైడర్ దాటుకుని అవతలి రోడ్డులోకి దూసుకుపోయిం ది. ఆ రోడ్డులో ఏలూరు, రాజహేంద్రవరం నుంచి వస్తున్న రెండు కార్లను ఢీకొంది. అందులో ఒక కారులో ఉన్నవారికి ఏం కాలేదు. మరో కారులో ఉన్న ఏలూరు తం గెళ్ళమూడి ప్రాంతానికి చెందిన మహ్మద్ సలీం సిస్టి (44) మృతిచెంచాడు. శనివారం కుటుంబీకులతో రంజాన్ పండుగ చేసుకుని ఆదివారం ఉదయం ఆనందంగా ఇంటి నుంచి బయలుదేరిన కాసేపటికే మృత్యువాతపడినట్టు కుటుంబీకులకు సమాచారం అందడంతో వారు కన్నీరుమున్నీరుగావిలపించారు. ప్రమాదానికి కారణమైన యెర్టిగా కారులో ఉన్న సిరియాదులసత్యనారాయణ, మామిడాల నారా యణమూర్తి అక్కడికక్కడే మృతిచెందారు. కాకినాడ సర్పవరం జంక్షన్‌కు చెందిన డ్రైవర్ బల్లా చిట్టిబాబు సహా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సీఐ బీఎన్.నాయక్ సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేపట్టారు.