Share News

34 శాతాన్ని మించి ఇస్తాం

ABN , Publish Date - Oct 10 , 2026 | 05:33 AM

బీసీలకు అన్ని విధాలా సముచిత స్థానం కల్పించిన పార్టీ టీడీపీ అని ఆ పార్టీకి చెంది న పలువురు నేతలు స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పలువురు టీడీపీ నేతలు శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

34 శాతాన్ని మించి ఇస్తాం

  • టీడీపీతోనే బీసీలకు సముచిత స్థానం.. వారి ఎదుగుదల వైసీపీకి ఇష్టం లేదు: పల్లా

అమరావతి, న్యూఢిల్లీ, హిందూపురం, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): బీసీలకు అన్ని విధాలా సముచిత స్థానం కల్పించిన పార్టీ టీడీపీ అని ఆ పార్టీకి చెంది న పలువురు నేతలు స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పలువురు టీడీపీ నేతలు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పా ర్టీ పరంగా బీసీలకు న్యాయం చేస్తామన్నారు. స్థానికంలో బీసీలకు 34 శాతం కన్నా ఎక్కువే ఇస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నా రు. ‘బీసీలకు న్యాయం చేసేందుకు టీడీపీ సిద్ధంగా ఉంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతానికన్నా ఎక్కువ సీట్లే ఇస్తాం. బీసీలకు 34 శాతం రిజర్వేష న్లు కల్పించే ప్రయత్నాలను అడ్డుకోవడం ద్వారా వైసీపీ మరోసారి తాను బీసీ వ్యతిరేకమని చాటుకుంది. బీసీలు రాజకీయంగా ఎదగకూడదన్నదే జగన్‌ అండ్‌ గ్యాంగ్‌ ఉద్దేశం. బీసీలను ఓటు బ్యాంకు గా ఉపయోగించుకోవడం వైసీపీ రాజకీయమైతే, బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించి నాయకత్వా న్ని పెంపొందించడం టీడీపీ విధానం. న్యాయస్థానా ల నిర్ణయాలను గౌరవిస్తూనే బీసీలకు రాజకీయంగా సముచిత ప్రాధాన్యం కల్పించేందుకు అన్ని మార్గాల ను అనుసరిస్తాం’ అని పల్లా స్పష్టం చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ... ‘బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా సముచిత స్థానం కల్పించింది టీడీపీయే. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యాని కి టీడీపీ కట్టుబడి ఉంది. రూ.12,500 కోట్ల ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి రావాలంటే స్థానిక ఎన్నికలు జరపాల్సిందే. స్థానిక ఎన్నికలు జరగకుండా అడ్డుకునేందుకు జగన్‌ అన్ని ప్రయత్నాలు చేశారు. అభ్యర్థులు దొరకరనే భయంతోనే ఎన్నికలను ఆపేందుకు జగన్‌ కుట్రలు పన్నుతున్నారు. వైఎస్‌ రాజారెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిల కాలం నుంచే బీసీల పట్ల వ్యతిరేక ధోరణి ఉంది. జగన్‌ కూడా అదే కొనసాగిస్తున్నారు’ అని కొల్లు విమర్శించారు.


రిజర్వేషన్‌కు కట్టుబడి ఉన్నాం: సవిత

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌ అమలు హామీకి కట్టుబడి ఉన్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో ఆమె మాట్లాడారు. బీసీ రిజర్వేషన్‌ కోసం చివరి వరకు న్యాయపోరా టం చేశామని, సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తామన్నారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని అన్నారు. బీసీలు రాజకీయంగా ఎదగడం జగన్‌కు ఇష్టం లేదన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో టీడీపీ నేతలను చంపుతామని బెదిరించి, వైసీపీ వారు సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎ న్నికయ్యారని అన్నారు. ఇప్పుడు జరిగే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటే పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు.

బీసీలకు టీడీపీ అండ: ఎంపీ కలిశెట్టి

రాజకీయాల్లో బీసీల ఎదుగుదలకు టీడీపీ ఎప్పు డూ అండగా ఉంటుందని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు స్పష్టం చేశారు. చట్టపరంగా బీసీలకు న్యాయం చేయలేకపోయినా, పార్టీపరంగా బీసీలకు న్యాయం చేస్తామని తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘టీడీపీ ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు న్యాయం చేస్తుంది. వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లి బీసీలకు తీరని ద్రోహం చేశారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే గొడ్డలి పార్టీ చూస్తోంది’ అని కలిశెట్టి విమర్శించారు.

బీసీలకు తొలి నుంచీ ప్రాధాన్యమిచ్చింది టీడీపీనే: యనమల

స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న టీడీపీ దృఢమైన నిర్ణయం, భారత రాజ్యాంగ పీఠికలోని సామాజిక న్యాయానికి అనుగుణంగా ఉందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన అనేక బీసీ కమిషన్లు మొత్తం జనాభాలో బీసీల జనాభా 50 శాతానికిపైగా ఉందని స్పష్టం చేశాయని తెలిపారు. ఆ దామాషాలో బీసీలకు న్యాయం జరగడం లేదన్నారు. టీడీపీ ఒక్కటే బీసీలకు తొలి నుంచీ తగిన రాజకీయ ప్రాధాన్యమిస్తోందని యనమల స్పష్టం చేశారు.


స్థానికాన్ని అడ్డుకోవడానికి వైసీపీ కుట్ర: మంత్రి నారాయణ

బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. శుక్రవారం నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో బీసీలకు 34 శాతం అవకాశం కల్పించి మాట నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను త్వరలోనే నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కోర్టు తీర్పు బయటకు రావడంతో త్వరలోనే ఎన్నికల షెడ్యుల్‌కు నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉందన్నారు. ఈ ఎన్నికలను నిర్వహించడం వైసీపీకి ఇష్టం లేదని ఆరోపించారు. ఇవి జరిగితే 123 మున్సిపాలిటీల్లో కూటమి విజయం సాధిస్తుందనే భయం ఆ పార్టీకి ఉందని తెలిపారు. ‘సర్‌’ను సాకుగా చూపి ఎన్నికలను ఆపాలని తీవ్రంగా ప్రయత్నించారని విమర్శించారు. తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో న్యాయపరమైన అంశాలను పరిశీలించి ముందుకెళ్తామని మంత్రి చెప్పారు.

వైసీపీ కుట్రలకు సుప్రీం బ్రేక్‌: విప్‌ కాలవ శ్రీనివాసులు

రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు జరుగకుండా వైసీపీ నాయకత్వం పన్నిన కుట్రలు సుప్రీం కోర్టులో వీగిపోయాయని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం మారెంపల్లిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియ ముగిసిన తరువాతనే మున్సిపల్‌ వార్డుల పునర్విభజన జరగాలని వైసీపీ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించిందని అన్నారు. స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు ఇష్టపడని వైసీపీ, ఏదో ఒకవిధంగా ఎన్నికలు జరగకుండా అడ్డుకోవాలని ప్రయత్నించిందని ఆరోపించారు. ఇక ఎన్నికల సంఘం తదుపరి ప్రక్రియను ముందుకు తీసుకెళుతుందని తెలిపారు.


24 శాతానికి ఎందుకు తగ్గించారో వైసీపీ చెప్పాలి: ఎమ్మెల్యే గల్లా

1995లో చంద్రబాబు బీసీలకు 34 శాతం రిజర్వేష్లన్లు కల్పిస్తే దాన్ని 24 శాతానికి ఎందుకు తగ్గించాల్సి వచ్చిందో వైసీపీ సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే గల్లా మాధవి డిమాండ్‌ చేశారు. కూటమి ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను 34 శాతానికి పునరుద్ధరిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి జీవోలు జారీ చేసినప్పటి నుంచి గొడ్డలి పార్టీ దాన్ని అడ్డుకునేందుకు కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ వచ్చిందని అన్నారు. కాగా, స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై టీడీపీ, వైసీపీ వైఖరిలో స్పష్టమైన తేడా ఉందని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌ అన్నారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యమివ్వడం వైసీపీకి ఇష్టం లేదన్నారు. చంద్రబాబు బీసీలకు రాజకీయ నాయకత్వం ఇవ్వాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారని తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 10 , 2026 | 05:33 AM