ప్రధాని నుంచి కార్పొరేటర్ వరకు జీతాలు తీసుకోకూడదు!
ABN , Publish Date - Oct 10 , 2026 | 04:54 AM
దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యం నివారణ కోసం ప్రధాని మోదీ నుంచి కార్పొరేటర్ వరకు రెండేళ్ల పాటు ఎటువంటి జీత భత్యాలు తీసుకోకూడదని కాకినాడ శ్రీపీఠం ...
స్వామి పరిపూర్ణానంద సరస్వతి
సర్పవరం జంక్షన్ (కాకినాడ), అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యం నివారణ కోసం ప్రధాని మోదీ నుంచి కార్పొరేటర్ వరకు రెండేళ్ల పాటు ఎటువంటి జీత భత్యాలు తీసుకోకూడదని కాకినాడ శ్రీపీఠం నిర్వాహకులు స్వామి పరిపూర్ణానంద సరస్వతి పేర్కొన్నారు. దేవీ శరన్నవరాత్రులు పురస్కరించుకుని శ్రీపీఠంలో ఈ నెల 11 నుంచి 21వ తేదీ వరకు 4వ విడత మహాశక్తి యాగం-2026 నిర్వహించనున్నట్టు శుక్రవారం ఆయన తెలిపారు. లోక కల్యాణార్థం ఇప్పటివరకు మూడుసార్లు శతకోటి కుంకుమార్చన పూర్తయిందన్నారు. దేశవిదేశాల్లోని లక్షలాది భక్తులు వివిధ మాధ్యమాల ద్వారా శతకోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు