చెవిరెడ్డికి నేనే ఎస్కార్ట్!
ABN , Publish Date - Nov 06 , 2026 | 04:41 AM
‘అన్నా... మీకు నేనే ఎస్కార్ట్‌గా ఉంటాను. ఈ రోజు చంద్రగిరిలో మీరు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తాను’’ అంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులవర్తి నాని సతీమణి సుధారెడ్డి షాక్ ఇచ్చారు.
అన్న ఎక్కడికి వెళితే అక్కడికి పదండి
కలిసే పోలింగ్ కేంద్రాలను పరిశీలిద్దాం
చెవిరెడ్డికి పులవర్తి నాని సతీమణి కౌంటర్
భాస్కర్ రెడ్డికి పులవర్తి నాని సతీమణి కౌంటర్
తిరుపతి, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ‘అన్నా... మీకు నేనే ఎస్కార్ట్‌గా ఉంటాను. ఈ రోజు చంద్రగిరిలో మీరు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తాను’’ అంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులవర్తి నాని సతీమణి సుధారెడ్డి షాక్ ఇచ్చారు. ‘పరిషత్’ ఎన్నికల సందర్భంగా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలంలో ఈ ఆసక్తికర సంఘటన జరిగింది. తిరుపతి రూరల్ మండలం వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా చెవిరెడ్డి కుమారుడు హర్షిత్‌రెడ్డి పోటీ చేశారు. పోలింగ్ రోజు చెవిరెడ్డితోపాటు ఆయన కుమారులు మోహిత్, హర్షిత్‌లతో కలసి రూరల్ మండలంలోనే మకాం వేశారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తూ వచ్చారు. ఈ సందర్భంగా పలుమార్లు ఎమ్మెల్యే పులవర్తి నాని ఎదురుపడటంతో పరస్పర దూషణలు, వాగ్వాదాలూ చోటు చేసుకున్నాయి. తర్వాత నాని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత... చెవిరెడ్డి సప్తగిరి పోలింగ్ బూత్ వద్ద ఉండగా ఎమ్మెల్యే నాని సతీమణి సుధారెడ్డి అక్కడికి చేరుకున్నారు.
‘అన్నా.. చెవన్నా!’ అంటూ నేరుగా చెవిరెడ్డితో మాట్లాడారు. ‘‘అ న్నా... ఎక్కడా గలాటా జరగొద్దు! లేని కొట్లాటలు చూపించొద్దు. నానెన్స్ క్రియేట్ చేయొద్దు’’ అని సుధారెడ్డి సూచించారు. ‘అన్నకు కుర్చీ వేయండి. నాకూ ఒక కు ర్చీ వేయండి. ఇక్కడే కూర్చుంటా!’ అని తేల్చి చెప్పారు. ‘‘పోలింగ్ జరిగే ప్రాంతాలకు కలిసే వెళదాం. కావాలంటే ఒకే కారులో వెళ్లి పరిశీలిద్దాం’’ అని చెవిరెడ్డితో అన్నారు. ‘‘ఈ రోజు మా అన్నకు నేనే ఎస్కార్ట్. చంద్రగిరిలో ఆయన ఎక్కడికి పోతే అక్కడికి పోవాలి. ఆయన కారును ఫాలోకండి’’ అని తన డ్రైవర్‌కు సూచించారు.
రణధీరపురం, న్యూ మంగళం, తిరుమలనగర్ పోలింగ్ కేంద్రాల వద్దకు చెవిరెడ్డి వెంట ఆమె కూడా వెళ్లారు. సుధారెడ్డి మాటలకు చెవిరెడ్డి స్పందించకుండా... మౌనంగా మరోవైపునకు తిరిగి నిల్చోవడం, ఫోన్‌లో మాట్లాడుతూ పక్కకు తిరగడం, నడుస్తూ ముందుకు వెళ్లడం చేశారు. ‘‘చంద్రగిరి నియోజకవర్గంలో ఏదో జరిగిపోతోందని చెప్పేందుకు చెవిరెడ్డన్న నాన్సెన్స్ క్రియేట్ చేస్తున్నారు. పోలీసులను బెదిరించడం, పోలింగ్ సిబ్బందికి శాపనార్థాలు పెట్టడం సరికాదు. అందుకే... అన్నకు ఎస్కార్ట్‌గా తిరుగుతున్నాను’’ అని సుధారెడ్డి అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఓటెత్తిన పల్లెలు
అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ