Share News

టీడీపీలో వైసీపీ నాయకుల చేరిక

ABN , Publish Date - Nov 02 , 2026 | 11:56 PM

మండలంలోని గరుడుభద్ర పంచా యతీకి చెందిన వైసీపీ ముఖ్యనాయకులు రాపాక భాస్కరరావు, యలమంచి దుర్యోధన, మడ్డు వల్లభరావు సోమవారం టీడీపీ పలాస సమన్వయకర్త, రాష్ట్ర కార్య దర్శి వై.వెంకన్నచౌదరి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు.

  టీడీపీలో వైసీపీ నాయకుల చేరిక
వెంకన్నచౌదరి సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు

వజ్రపుకొత్తూరు, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గరుడుభద్ర పంచా యతీకి చెందిన వైసీపీ ముఖ్యనాయకులు రాపాక భాస్కరరావు, యలమంచి దుర్యోధన, మడ్డు వల్లభరావు సోమవారం టీడీపీ పలాస సమన్వయకర్త, రాష్ట్ర కార్య దర్శి వై.వెంకన్నచౌదరి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. కార్యక్రమంలో క్లస్టర్‌ ఇన్‌చార్జి దువ్వాడ హేంబాబు చౌదరి, జిల్లా ఉపాధ్యక్షుడు పోతనపల్లి సాంబమూర్తి, మురి పింటి అఖిల్‌, కోనేరు ఆదినారాయణ, గణపతిరావు, చెల్లూరు రాజశేఖర్‌ పాల్గొన్నారు.

కత్తిరివానిపేట క్యాంపు కార్యాలయంలో..

జలుమూరు, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): కత్తిరివానిపేట క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సమక్షంలో సోమవారం హుస్సేనుపురం పంచాయతీ మాజీ సర్పంచ్‌ అర్జునరావు వైసీపీని వీడి తన అనుచరులతో టీడీపీలో చేరారు. గొటివాడకు చెందిన 15 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. రావాడ ముఖలింగం, నేతింటి మల్లేసు, సోమినేని రామారావు, పిర్ల రాంబాబు, గురువు శ్రీనివాసరావు కుటుంబాలతో పాటు మరో 10 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరందరికి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు వెలమల రాజేంద్రనాయుడు, పంచిరెడ్డి రామచంద్రరావు, గురుబెల్లి ఝాన్సీ పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2026 | 11:56 PM