Share News

మత్స్యకారుల సంక్షేమాన్ని విస్మరించిన వైసీపీ

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:22 AM

గత వైసీపీ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా విస్మరించిం దని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మండిప డ్డారు.

మత్స్యకారుల సంక్షేమాన్ని విస్మరించిన వైసీపీ
బాధిత కుటుంబానికి నమూనా చెక్కు అందిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

  • మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, మార్చి 2(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా విస్మరించిం దని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మండిప డ్డారు. సంతబొమ్మాళి మండలం గొలుగువాని పేట గ్రామాని చెందిన గొర్లె రామారావు ఇటీవల సముద్రంలో వేటచేస్తూ ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనలో మరణించగా.. ఆ కుంటుంబానికి సోమ వారం స్థానిక ఎన్టీఆర్‌ భవనలో రూ.5లక్షలు సా యాన్ని అందజేసి మాట్లాడారు. మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, అధి కారంలోకి వచ్చిన 20 నెలల్లో అనేక సంక్షేమ ప థకాలు అందించామని గుర్తు చేశారు. రాష్ట్రంలో సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరిం ణించిన 95 మంది మత్స్యకారుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా సాయం అందజేశామన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.3 కోట్లు

పీఎం సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) ద్వారా టెక్కలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 300 మందికి రూ.3కోట్లు సాయంగా అందించామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సోమవారం స్థానిక ఎన్టీఆర్‌ భవనంలో టెక్కలి నియోజకవర్గా నికి చెందిన 22 మందికి రూ.19లక్షల సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. అనారో గ్యం ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్న వారికి ప్రభుత్వం అండగా ఉం టుందన్నారు. త్వరలోనే ప్రతి కుటుంబానికి రూ.25లక్షలు వైద్య బీ మా వర్తించే లా చేస్తు న్నట్టు తెలిపారు. కార్యక్ర మంలో రాష్ట్ర కళిం గ కోమటి కార్పొరేషన్‌ చైర్మన్‌ బోయిన గోవిందరాజులు, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ కింజరాపు హరివరప్రసాద్‌, టెక్కలి ఆర్డీవో ఎన్‌.కృష్ణమూర్తి, పీఏసీఎస్‌ చైర్‌పర్సన్‌ వెలమల విజయలక్ష్మి, నాయకులు కామేశ్వరరావు, తర్ర రామకృష్ణ, సాసుమంతు అనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2026 | 12:22 AM