వైసీపీ మహాపరాధం చేసింది: జనసేన
ABN , Publish Date - Feb 03 , 2026 | 11:29 PM
గత వైసీపీ ప్రభుత్వం పామాయి ల్‌కు రసాయనాలు కలిపి నెయ్యిగా మార్చి దానితో తిరుమల లడ్డూ ప్రసాదం తయారు చేసి మహాపరాధానికి పాల్పడిందని జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ అన్నారు.
శ్రీకాకుళంఅర్బన్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం పామాయి ల్‌కు రసాయనాలు కలిపి నెయ్యిగా మార్చి దానితో తిరుమల లడ్డూ ప్రసాదం తయారు చేసి మహాపరాధానికి పాల్పడిందని జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ అన్నారు. నగరంలోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగలేదని సిట్ ఎక్కడా నివేదిక ఇవ్వలేద న్నారు. లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యి అసలుది కాదని సిట్ తేల్చింద న్నారు. చుక్క పాలు కూడా కొనకుండా 20 కోట్ల లడ్డూలను ఎలా తయారు చేశారో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకుల నోటి దురుసు కారణంగానే దాడులు జరుగుతున్నాయని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పై విషప్రచారం చేస్తే క్షమించేది లేదని హెచ్చరిం చారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు పేడాడ రామ్మోహన్, కణితి కిరణ్‌కుమార్, బలగ ప్రవీణ్‌కుమార్, పాత్రుని పాపారావు, భూపతి అర్జున్‌కు మార్, చిట్టి భాస్కర్, ముంగి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.