Share News

యువకుడి ఆత్మహత్య

ABN , Publish Date - May 15 , 2026 | 12:21 AM

మండలంలోని గాజులకొల్లివలస గ్రామానికి చెందిన వెలమరెడ్డి రాకేష్‌ (25) బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ సనపల బాలరాజు తెలిపారు.

 యువకుడి ఆత్మహత్య
రాకేష్‌(ఫైల్‌)

ఆమదాలవలస, మే 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గాజులకొల్లివలస గ్రామానికి చెందిన వెలమరెడ్డి రాకేష్‌ (25) బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ సనపల బాలరాజు తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు. తం డ్రిలేని రాకేష్‌ తల్లి మంగమ్మతో గాజులకొల్లివలసలో నివాసం ఉంటున్నాడు. బుధవారం రాత్రి రాకేష్‌తో ఇంటిలో గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన రాకేష్‌ ఇంటిలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకొన్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సమీపంలో ఉన్న జొన్నవలస కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే రాకేష్‌ మృతి చెందినట్లు నిర్ధారించారు. రాకేష్‌ మేనమామ కంచర్ల శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. శవపంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుప త్రికి తరలించారు.ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా గాజులకొల్లివలస గ్రామానికి చెందిన క్రికెట్‌ క్రీడాకారుడు వెలమల రెడ్డి రాకేష్‌ అలియాస్‌ రాకేష్‌ మృతిచెందడంపై క్రీడాకారులు సంతాపం తెలిపారు.

Updated Date - May 15 , 2026 | 12:21 AM