యువకుడి ఆత్మహత్య
ABN , Publish Date - Jan 10 , 2026 | 12:21 AM
కాశీబుగ్గ రోట రీనగర్‌లో భార్యతో కలిసి నివాసం ఉంటున్న ఓ యువకుడు గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకు న్నాడు.
పలాస, జనవరి 9(ఆంధ్రజ్యోతి): కాశీబుగ్గ రోట రీనగర్‌లో భార్యతో కలిసి నివాసం ఉంటున్న ఓ యువకుడు గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకు న్నాడు. వివరాల్లోకి వెళ్తే.. వజ్రపుకొత్తూరు మండలం బెండి గ్రామానికి చెందిన దేవలింగం మహేష్(25) పలాస మండలం వీరరామచంద్రపురం గ్రామానికి చెందిన జ్యోత్స్నను ఏడాది కిందట ప్రేమించి వివా హం చేసుకున్నాడు. వీరికి ఇంకా పిల్లలు లేరు. మహేష్ అర్చకత్వంతో పాటు ఓ ప్రైవేట్ సంస్థలో కొరియర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మహేష్ గురువారం రాత్రి ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం కాశీబుగ్గ పోలీసులకు సమాచారం రావడంతో సీఐ వై.రామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విష యం తెలుసుకున్న మహేష్ తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకుని బోరున విల పించారు. తమ కుమారుడి మృతికి అతడి భార్య జ్యోత్స్న వేధింపులే కారణమని ఆరోపించారు. ఈ మేరకు కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లైన నుంచి భార్య వేధింపులు ఎక్కువయ్యాయని, తగాదాలు లేకుండా కాపురం చేసుకోవాలని చాలాసార్లు చెప్పామన్నారు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో వృద్ధాప్యంలో ఉన్న తమకు దిక్కెవరంటూ వారి రోధన వర్ణణాతీతం. మహేష్ తండి సింహాచలం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
చెట్టుపై నుంచి జారిపడి వ్యక్తి మృతి
పోలాకి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): కొబ్బరి చెట్టేక్కి బొండాలు తీస్తుండగా జారిపడి కోడూరు గ్రామానికి చెందిన టెంక సంజీవి(40) మృతి చెందాడు. శుక్రవారం ఉదయం సంజీవి తుంగాన రామారావు, బల్ల గోపాలరావుతో కలిసి బెండు జగన్నాఽథం కొబ్బరితోటలో బొండాలు కోస్తుండగా నడుముకు కట్టుకున్న మోగు తెగిపోయింది. దీంతో సుమారు 20 అడుగుల ఎత్తు నుంచి కిందకి పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డా డు. కొనఊపిరితో ఉన్న సంజీవికి వెంటనే నరసన్నపేట ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపాయినట్టు వైద్యులు నిర్ధారించారు. సంజీవికి భార్య ముత్యాలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ జి.రంజిత్ కేసు నమోదు చేశారు. సంజీవి కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తుంటాడని, ఈ క్రమంలో కొబ్బరి చెట్టు ఎక్కి బొండాలు కోస్తుండగా జారిపడి మృతి చెందినట్టు గ్రామస్థులు చెబుతున్నారు.