Share News

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

ABN , Publish Date - Mar 14 , 2026 | 12:45 AM

లట్టిగాం గ్రా మానికి చెందిన గురువెల్లి మురళి(38) విద్యుదాఘా తంతో గురువారం రాత్రి మృతిచెందారు.

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

నందిగాం, మార్చి 13(ఆంధ్రజ్యోతి): లట్టిగాం గ్రా మానికి చెందిన గురువెల్లి మురళి(38) విద్యుదాఘా తంతో గురువారం రాత్రి మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మురళి గురువారం రాత్రి భోజనం చేసిన తర్వాత మేడపై పడుకునేందుకు వెళ్లా డు.. మేడపై నుంచి వెళ్తున్న విద్యుత్‌ వైర్లకు చేయి తగలడంతో షాక్‌కు గురై అక్కడే కింద పడిపోయాడు. ఇది గమనించిన భార్య కృష్ణకుమారి స్థానికుల సా యంతో చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా కేంద్ర ఆసు పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యు లు నిర్ధారించారు. కాగా మురళి ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిం చుకుంటున్నాడు. మురళికి భార్యతోపాటు తల్లిదండ్రులు వేణమ్మ, నారాయణ రావు, కుమారుడు రాకేష్‌, కుమార్తె రేష్మ ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ షేక్‌ మహ్మద్‌ ఆలీ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వ హించి కుటుంబసభ్యులకు అప్పగించారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న మురళి అకాల మృతితో ఆ కుటుంబం రోడ్డున పడింది.

Updated Date - Mar 14 , 2026 | 12:45 AM