రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ABN , Publish Date - Nov 04 , 2026 | 12:43 AM
పైడిపేట శివాలయం సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నారువ గ్రామానికి చెందిన నిద్ర బంగి రాంబాబు (21) మృతి చెందాడు.
రణస్థలం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): పైడిపేట శివాలయం సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నారువ గ్రామానికి చెందిన నిద్ర బంగి రాంబాబు (21) మృతి చెందాడు. జేఆర్‌పురం ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. నారువ నుంచి ఆటోలో రాంబాబు కోష్ట వస్తుండగా ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఆటో బోల్తా పడింది. తీవ్రంగా గాయపడిన రాంబాబును చికిత్సకు కొండ ములగాం సీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. కుటుం బ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.