Share News

రైలు కింద పడి యువకుడి మృతి

ABN , Publish Date - Mar 26 , 2026 | 12:07 AM

శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వే స్టేషన్‌ సమీపంలో బుధవారం రైలు కింద పడి గుర్తు తెలియని యువకుడు మృతి చెం దాడు.

రైలు కింద పడి యువకుడి మృతి

ఆమదాలవలస, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వే స్టేషన్‌ సమీపంలో బుధవారం రైలు కింద పడి గుర్తు తెలియని యువకుడు మృతి చెం దాడు. జీఆర్పీ ఎస్‌ఐ ఎం.మధుసూదనరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఉదయం ఫలకనుమా ఎక్స్‌ప్రెస్‌ కింద పడి సుమారు 35 ఏళ్ల యువకుడు మృతి చెందాడన్నారు. రైల్వే స్టేషన్‌ సమీపంలోని రెండు, మూడు ప్లాట్‌ఫారాల మధ్య ఈ ప్రమా దం చోటు చేసుకుందన్నారు. నీలం రంగు టీ షర్ట్‌, నలుపు రంగు ఫ్యాంట్‌ ధరించి ఉన్నాడని, ఇతర వివరాలు తెలియరాలేదన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వ జన ఆసుపత్రికి తరలించామన్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 949 34 74582, 91103 05494 నెంబర్లలో సంప్రదించాలని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Mar 26 , 2026 | 12:07 AM