Share News

నాగావళి నదిలో దూకి యువకుడి ఆత్మహత్య

ABN , Publish Date - Apr 21 , 2026 | 12:31 AM

నాగావళి నదిలో దూకి యువకుడి ఆత్మహత్య

నాగావళి నదిలో దూకి యువకుడి ఆత్మహత్య

శ్రీకాకుళం క్రైం, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): నగరంలోని డేఅండ్‌నైట్‌ జంక్షన్‌ వద్ద వంతెన మీద నుంచి దూకి ఓ యువకుడు సోమవారం ఆత్మహత్య చేసుకున్నా డు. శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఎచ్చెర్ల మండలం ఇబ్రహీంబాద్‌కు చెందిన సీపాన వెంకటేష్‌(23) విశాఖపట్నంలో ఎంఎస్‌సీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. అయితే ఇటీవల అనారోగ్యా నికి గురై కొంతకాలంగా మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు శ్రీకాకుళం రైతు బజార్‌కు వచ్చి ఫిష్‌ అక్వేరి యంలో చేపల కోసం మేత కొనుగోలు చేసి తిరిగి ఇంటికి వెళుతూ.. డేఅండ్‌ నైట్‌ కూడలి వద్ద వంతెన పైనుంచి ఒక్కసారిగా నదిలోకి దూకాడు. అటుగా వెళుతున్న వాహనదారులు అవాక్కై రక్షించే ప్రయత్నం చేసి 108 వాహనంలో రిమ్స్‌కు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే వెంకటేష్‌ మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతుడి తండ్రి యుగంధర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్‌ సీఐ ఈశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Apr 21 , 2026 | 12:31 AM