యూత్‌క్లబ్ సేవలు ఆదర్శనీయం
ABN , Publish Date - May 03 , 2026 | 12:01 AM
బెజ్జిపురం యూత్‌క్లబ్ సేవలు ఆదర్శనీ యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీ ఎన్ మాధవ్, విజయనగరం ఎంపీ కలి శెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎంపీ కలిశెట్టి, ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్
లావేరు, మే 2 (ఆంధ్రజ్యోతి): బెజ్జిపురం యూత్‌క్లబ్ సేవలు ఆదర్శనీ యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీ ఎన్ మాధవ్, విజయనగరం ఎంపీ కలి శెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. శని వారం యూత్‌క్లబ్ 45వ వార్షికోత్సవం నిర్వహిం చారు. తొలుత క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద, దివం గత కింజరాపు ఎర్రన్నాయుడు, యూత్‌క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇజ్జాడ సన్యాసప్పల నాయుడు విగ్రహాలను ఆవిష్కరించారు. 45 ఏళ్లుగా యూత్‌క్లబ్ జిల్లా నలుమూలలా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టి విశేష స్థానం పొం దిందన్నారు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ సమాజ సేవ చేయాలన్నారు. ఈ సందర్భంగా హస్తకళా వస్తువులు, వంటింటి సామాగ్రి స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. కార్యక్రమం లో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, డీసీ ఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, బీజేపీ విజ యనగరం పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి ఇజ్జా డ శ్రీనివాసరావు, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ, యూత్‌క్లబ్ డైరెక్టర్ ఎం.ప్రసాద రావు, ప్రధాన కార్యదర్శి గంట్యాడ అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు.