Share News

మెక్సికోలో అంపోలు యువకుడి మృతి

ABN , Publish Date - Mar 18 , 2026 | 12:08 AM

అంపోలు గ్రామానికి చెందిన నాగుబిల్లి వెంకట ధర్మారావు (29) మెక్సికోలో మృతి చెందినట్లు అక్కడి నుంచి మంగళగిరిలో ఉన్న కుటుంబ సభ్యులకు ఫోన్‌ ద్వారా సమాచారం వచ్చింది.

మెక్సికోలో అంపోలు యువకుడి మృతి
వెంకట ధర్మారావు (ఫైల్‌ )

గార, మార్చి 17(ఆంధ్రజ్యోతి): అంపోలు గ్రామానికి చెందిన నాగుబిల్లి వెంకట ధర్మారావు (29) మెక్సికోలో మృతి చెందినట్లు అక్కడి నుంచి మంగళగిరిలో ఉన్న కుటుంబ సభ్యులకు ఫోన్‌ ద్వారా సమాచారం వచ్చింది. మాజీ సర్పంచ్‌ జీవీ రమణమూర్తి, గ్రామస్థుడు నరసింహమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. డిప్లొమో చదివిన ధర్మారావు మూడేళ్లుగా మెక్సికోలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం రూమ్‌మేట్‌ రూంకి వెళ్లి చేసేసరికి ధర్మారావు మృతిచెంది ఉండడంతో వెంటనే అక్కడి నుంచి మృతుడి తల్లిదండ్రులకు ఫోన్‌లో సమాచార మిచ్చాడు. మృతుడి తల్లిదండ్రులు మంగళగిరిలో కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారని, ధర్మారావు మృతిచెందిన విషయాన్ని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు దృష్టికి తీసుకువెళతామని వారు పేర్కొన్నారు.

Updated Date - Mar 18 , 2026 | 12:08 AM