Share News

మనస్తాపానికి గురై యువకుడి మృతి

ABN , Publish Date - Apr 20 , 2026 | 12:52 AM

అరకభద్ర గ్రామానికి చెందిన వలస కూలీ లబో బెహరా(24) ఒడిశా రాష్ట్రం బరంపురం సమీపంలోని తన బంధువుల ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జరిగింది.

మనస్తాపానికి గురై యువకుడి మృతి

  • ఒడిశాలో బంధువుల ఇంటిలో ఆత్మహత్య

ఇచ్ఛాపురం, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): అరకభద్ర గ్రామానికి చెందిన వలస కూలీ లబో బెహరా(24) ఒడిశా రాష్ట్రం బరంపురం సమీపంలోని తన బంధువుల ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జరిగింది. మృతుడి తల్లిదండ్రులు దక్షిణ బెహరా, మన్ను బెహరా, రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. దక్షిణ బెహరా కుమ్మరి వృత్తి చేసుకుంటూ కుటుం బాన్ని పోషించుకుంటున్నాడు. కుమారుడు వలసకూలీ గా ఇతర దేశాలకు వెళ్లి వస్తుంటాడు. అయితే ఓ విషయంలో మనస్తాపానికి గురై మృతి చెందాడు. తన కుమారుడి మృతిపై ఇచ్ఛాపురం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేసినట్లు తల్లి మన్ను బెహరా తెలిపారు. అయితే దీనిపై రూరల్‌ ఎస్‌ఐ జనార్దనరావును వివరణ కోరగా దీనిపై ఎటువంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు.

మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ

ఎచ్చెర్ల, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): పొన్నాడ పంచాయతీ తెప్పరేవు గ్రామానికి చెందిన గొల్లంగి అప్పల నరసమ్మ మెడలోని బంగారుప్లే గొలుసుకు గుర్తు తెలియని వ్యక్తి లాక్కొని పారిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. అప్పలనర్సమ్మ శనివారం సాయంత్రం పొలానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి ఆమె మెడలోని సుమారు 3 తులాల బం గారు పేట్ల గొలుసును లాక్కోనిపోయాడు. గ్రామా నికి వెళ్లే తోవలో మర్రిచెట్టు వద్ద తన మెడలోని బంగారు పేట్ల గొలుసును తెంపుకునిపోయాడని ఆమె పోలీ సులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ జి.లక్ష్మణరావు తెలిపారు.

Updated Date - Apr 20 , 2026 | 12:52 AM