రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ABN , Publish Date - Jul 13 , 2026 | 12:05 AM
జాతీయ రహదారి పొడుగుపాడు గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో సోంపేట గ్రామానికి చెందిన బలగ సతీష్ (27) మృతి చెందాడు.
కోటబొమ్మాళి, జూలై 12(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి పొడుగుపాడు గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో సోంపేట గ్రామానికి చెందిన బలగ సతీష్ (27) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. సతీష్ నరసన్నపేట నుంచి సోంపేట వైపు ద్విచక్రవాహనం పై వెళ్తుండగా.. పొడుగుపాడు గ్రామ సమీపంలోకి వచ్చే సరికి అదే రహదారిలో వస్తున్న లారీ వెనుక నుంచి ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన సతీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృత దేహాన్ని స్థానిక సామాజిక ఆసుపత్రికి పోస్టుమార్టంకోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వంగపండు సత్యనారాయణ తెలిపారు.
గాయపడిన వ్యక్తి ..
పలాస, జూలై 12(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి శాసనం వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన పి.నర్సింహులు(50) శ్రీకాకుళం లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందిన ట్టు కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ తెలిపారు. ఆదివారం సీఐ తెలిపిన వివరాల మేరకు.. పశువుల వ్యాపారం కోసం ద్విచక్ర వాహనంపై మన్మఽథరావుతో కలిసి కంచిలి వెళ్లిన నర్సింహులు తిరిగి స్వగ్రామం తులసిపేట వస్తుండగా.. వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మన్మ థరావు, నర్సింహులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నర్సింహులు పరిస్థితి విష మించడంతో శ్రీకాకుళంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. లారీ సీజ్ చేసి.. పశ్చిమబెంగాల్‌కు చెందిన డ్రైవరు విశ్వరూప్‌బార్‌పై కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు..
ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్..
నరసన్నపేట, జూలై 12(ఆంధ్రజ్యోతి): నడగాం- గొనపపేట గ్రామాల మధ్య ఆర్‌అండ్‌బీ రహదారిపై ట్రాక్టర్ బోల్తాపడిన ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందినట్టు ఎస్‌ఐ గణేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మే రకు.. మండలంలో విద్యుత్ ప్రత్యేక లైన్ (ఆర్‌డీఎస్‌ఎస్) పనులను గత కొన్నాళ్లుగా పశ్చిమబెంగాల్ రాష్ట్రా నికి చెందిన కూలీలు చేస్తున్నారు. శనివారం పనులు ముగించుకొని ట్రాక్టర్‌పై గొనపపేట నుంచి నడగాం వెళ్తుండగా.. అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ షేక్ ఇబ్రహీం (30) శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించగా.. చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందాడు. కేసుదర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.