Share News

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , Publish Date - Apr 17 , 2026 | 12:26 AM

జాతీయ రహదారి పాకివలస జంక్షన్‌ వద్ద గురువారం తెల్ల వారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇదే మం డలానికి చెందిన పొన్నానపేట గ్రామానికి చెందిన ము ద్దాడ మురళి(38) మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

కోటబొమ్మాళి, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి పాకివలస జంక్షన్‌ వద్ద గురువారం తెల్ల వారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇదే మం డలానికి చెందిన పొన్నానపేట గ్రామానికి చెందిన ము ద్దాడ మురళి(38) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మురళి తన ద్విచక్రవాహనంపై కూ రగాయలు తీసుకుని శ్రీపురం కూరగాయల మార్కెట్‌కు వెళ్లి విక్రయించుకొని తిరిగి గ్రామాని వస్తుండగా.. పాకి వలస జంక్షన్‌ వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని లారీ ఢీకొంది. ఈ ఘటనలో మురళి అ క్కడకక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలా నికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వంగపండు సత్యనారాయణ తెలిపారు. కాగా మురళికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమా రులు ఉన్నారు. మురళి పగలంతా ఆటోనడుపుతూ, తెల్లవారుజామున తన కున్న కొదిపాటి పొలంలో పడించిన కూరగాయలను విక్రయించుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇప్పుడు మరళి మృతితో ఆ కుటుంబం రోడ్డున పడింది.

వాటర్‌ ట్యాంక్‌పై నుంచి జారిపడి యువకుడు..

రణస్థలం, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): తెప్పలవలస పంచాయతీ పాపారావుపేటలో వాటర్‌ ట్యాంక్‌ సెం ట్రంగ్‌ పనులు చేస్తుండగా జారిపడి కె.ప్రభాస్‌ (21) గురువారం మృతి చెందాడు. జేఆర్‌ పురం ఎస్‌ఐ ఎస్‌.చిరంజీవి తెలిపిన వివరాల మేరకు.. సీతంపేట మండలం కొత్తకోట గ్రామానికి చెందిన కె.ప్రభాస్‌ భవ న నిర్మాణ పనుల్లో భాగంగా సెంట్రంగ్‌ పనులు చేస్తుంటారు. ఈ క్రమంలో పాపారావుపేట గ్రామంలో నిర్మిస్తున్న వాటర్‌ ట్యాంక్‌ సెంట్రంగ్‌ పనులు చేస్తుం డగా జారి కిందపడిపోయాడు. గాయపడిన ప్రభాస్‌ను చికిత్స నిమిత్తం కొండములగాం సీహెసీకి తరలించగా.. అప్పటికే మృతి చెంది నట్టు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 17 , 2026 | 12:26 AM