రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ABN , Publish Date - Mar 20 , 2026 | 12:19 AM
పట్టణ పరిధిలోని జామి ఎల్లమ్మతల్లి గుడి సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బెల్లుపడ గ్రామం చిన్నకొండవీధికి చెందిన ఉప్పాడ కుమార్(22) అనే యువకుడు మృతి చెందాడు.
ఇచ్ఛాపురం, మార్చి 19(ఆంధ్రజ్యోతి): పట్టణ పరిధిలోని జామి ఎల్లమ్మతల్లి గుడి సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బెల్లుపడ గ్రామం చిన్నకొండవీధికి చెందిన ఉప్పాడ కుమార్(22) అనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బెల్లుపడ గ్రామానికి చెందిన త్రినాఽథ్, ఢిల్లమ్మల కుమారుడు కుమార్ గురువారం రాత్రి ద్విచక్రవాహనంపై ఇంటి నుంచి సురంగి రాజా మైదానం వైపు వెళ్తున్నాడు. ఇదే సమ యంలో ఎదురుగా ఇసుక లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొన్నాడు. ట్రాక్టర్ ట్రక్‌ను బలంగా ఢీకొనడంతో కింద పడిపోయిన కుమార్ తలకు తీవ్ర గాయాలు కావడంతో పాటు బైక్ నుజ్జునుజ్జయిపోయింది. తీవ్ర రక్త శ్రావంతో పడి ఉన్న కుమార్‌ను స్థానికులు చూసేసరికే మృతి చెంది ఉన్నాడని పట్టణ ఎస్‌ఐ ముకుందరావు తెలిపారు. కుమార్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.