Share News

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

ABN , Publish Date - Apr 18 , 2026 | 12:17 AM

సింగుపురం బీసీ హాస్టల్‌ అటెండర్‌ బెవర చిట్టిబాబు (34) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

శ్రీకాకుళం రూరల్‌, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): సింగుపురం బీసీ హాస్టల్‌ అటెండర్‌ బెవర చిట్టిబాబు (34) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెవర చిట్టిబాబు గ్రామంలోని బీసీ హాస్టల్‌ అటెండర్‌గా పనిచేస్తున్నాడు. కొన్నాళ్ల కిందట అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాడు. అయితే అప్పు తీర్చేందుకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులతో తరచూ గడవ జరిగేది ఈ క్రమంలో శుక్రవారం భార్య గాయత్రి పనికోసం వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి రెండు తలుపులు వేసి ఉన్నాయి. వాటిని తీసి లోపలకి వెళ్లి చూడగా చిట్టిబాబు ఉరి వేసుకుని కనిపించాడు. మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ-2 జె.రామారావు తెలిపారు. ఈయనకు నాలుగేళ్ల కుమార్తె ఉంది.

Updated Date - Apr 18 , 2026 | 12:17 AM