Share News

చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలి

ABN , Publish Date - Jun 27 , 2026 | 11:51 PM

ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్క లను వేయించాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్‌ కె.అనిత అన్నారు.

చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలి
ర్యాలీలో పాల్గొన్న డీఎంహెచ్‌వో అనిత, డీఐవో రాందాస్‌ తదితరులు

డీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.అనిత

అరసవల్లి, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్క లను వేయించాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్‌ కె.అనిత అన్నారు. ఈ మేరకు శనివారం డీఎంహెచ్‌వో కార్యా లయం వద్ద నుంచి పల్స్‌పోలియో అవ గాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెండు చుక్కల పోలి యో మందు వేయించడం ద్వారా పిల్లలకు ఆరోగ్య రక్షణ లభిస్తుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆది, సోమ, మంగళవారాల్లో పల్స్‌ పోలియో చుక్కల కార్యక్రమం చేపడుతున్నామని ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలన్నారు. అందరి సహకారం తోనే పోలియోరహిత సమాజం సాధ్యపడుతుంద న్నారు. కార్యక్రమంలో డీఐవో డా.రాందాసు, వైద్యులు కె.శివ రంజని, పి.సుజాత, హెచ్‌ఈఈ వో బి.ముఖలింగం, లక్ష్మి, కె.ఎర్రన్న, మోహిని, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2026 | 11:51 PM