బాగా చదువుకోవాలి: ఎంపీ కలిశెట్టి
ABN , Publish Date - Mar 04 , 2026 | 11:26 PM
విద్యార్థులు సృజనాత్మక బోధన లో బాగా చదువుకుని ఉన్నత స్థానా లను పొందాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.
జి.సిగడాం, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు సృజనాత్మక బోధన లో బాగా చదువుకుని ఉన్నత స్థానా లను పొందాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. బుధవారం పున్నాం పంచాయతీ బూటుపేట ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి హెచ్ ఎం కూర్మాన అరుణకుమారి బొమ్మలు, టీఎల్‌ఎంతో బోధిస్తున్న తీరును పరిశీలించి అభినందించారు. దేశ ప్రగతికి, సమాజ శ్రేయస్సుకు విద్యార్థు లు కీలకమని, చిన్ననాటి నుంచి నాయకత్వ లక్షణాలు పెంపొందించు కోవాలన్నారు. ఉపాధ్యాయులుచెప్పే విషయా లను మననం చేసుకుని ముందుకు సాగాలన్నారు. హెచ్‌ఎం అరుణకుమారి సృజనాత్మక బోధనా తీరును ఇటీవల విద్యాశాఖామంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా అభినందించారన్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులకు బోఽధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ సందర్భంగా ఆమెను సత్కరించారు. చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో సర్పంచ్ సుంకరి అప్పన్న, టీడీపీ మండల అధ్యక్షుడు కుమరాపు రవికుమార్, జోగినాయుడు, అశోక్, సత్యం తదితరులు పాల్గొన్నారు.