Share News

పోలియో చుక్కలు వేయించాలి

ABN , Publish Date - Jun 28 , 2026 | 12:03 AM

ఐదేళ్లలోపు పిల్లలకు పోలియోచుక్కలు వేయిస్తే అంగవైక్యల్యాన్ని అధిగమించవచ్చని వైద్యాధికారులు డి. పాపారావు, బి. వసుధ తెలిపారు. శనివారం తురకపేట పీహెచ్‌సీ పరిధిలోని తురకపేటలో ప్రజలకు పోలియో చుక్కలపై అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు.

 పోలియో చుక్కలు వేయించాలి
ఎల్‌.ఎన్‌.పేట: తురకపేటలో ర్యాలీచేస్తున్న వైద్యాధికారులు :

ఎల్‌.ఎన్‌.పేట, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): ఐదేళ్లలోపు పిల్లలకు పోలియోచుక్కలు వేయిస్తే అంగవైక్యల్యాన్ని అధిగమించవచ్చని వైద్యాధికారులు డి. పాపారావు, బి. వసుధ తెలిపారు. శనివారం తురకపేట పీహెచ్‌సీ పరిధిలోని తురకపేటలో ప్రజలకు పోలియో చుక్కలపై అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు.

ఫపాతపట్నంరూరల్‌, జూన్‌27(ఆంధ్రజ్యోతి):పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఆదివా రం నిర్వహించనున్నట్లు గంగువాడ పీహెచ్‌సీ వైద్యాధికారి హిమశ్రీ తెలిపారు. గంగువాడలో విలేకరులతో మాట్లాడుతూ పల్స్‌పోలియో కార్యక్రమంలో ఐదేళ్లలోపు వయస్సు వరకు గల పిల్లలకు ఉచితంగా పోలియోచుక్కలు వేస్తున్నట్లు తెలిపారు.

ఫపలాసరూరల్‌, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): మండలంలోని రెంటికోట పీహెచ్‌సీ అధికారుల ఆధ్వర్యంలో ఆదివారం పల్స్‌పోలియో పురస్కరించుకొని శనివారం వైద్యా ధికారి మౌనిక ఆధ్వర్యంలో రెంటికోటలో అవగాహనర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో సీహెచ్‌వో ఆదమ్మ, ఏపీఎన్‌జీవో సంఘ అధ్యక్షుడు బోనెల గోపాల్‌, సిబ్బంది కామే శ్వరరావు, ఈశ్వరరావు, లోలాక్షి, త్రివేణి, సుహాసిని పాల్గొన్నారు.

ఫనందిగాం, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): ప్రత్యేక పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజ యవంతం చేయాలని నందిగాం, నౌగాం పీహెచ్‌సీ వైద్యాధికారిణులు బి.గాయత్రి, మానసలు కోరారు. ఆదివారం జరిగే కార్యక్రమంలో భాగంగా నందిగాం పీహెచ్‌సీ పరిధిలో 23 కేంద్రాల్లో 1,965మందికి, నౌగాం పీహెచ్‌సీ పరిధిలో తొమ్మిది కేంద్రాల్లో 1,112 మందికి చుక్కలు వేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వారు తెలిపారు.

ఫజలుమూరు, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): పల్స్‌పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జలుమూరు వైద్యాధికారి గొలివి సుజాత తెలిపారు. శనివారం స్థానిక పీహెచ్‌సీ నుంచి ర్యాలీ నిర్వహించి పల్స్‌పోలియోపై అవగాహన కల్పించారు. ర్యాలీలో వైద్యాధికారి అహల్య, ఎంఈవో బి.మాధవరావు, సీహెచ్‌వో ఎస్‌.పద్మావతి, ఆరోగ్యవరిస్తరణాధికారి చిన్నరాజులు, పద్మావతి పాల్గొన్నారు.

Updated Date - Jun 28 , 2026 | 12:03 AM