గంజాయి అమ్మి లాభాలు పొందొచ్చని..
ABN , Publish Date - Mar 06 , 2026 | 11:45 PM
తక్కువ ధరల కు గంజాయి కొనుగోలు చేసి అధిక ధరలకు విక్ర యించి జీవితంలో సుఖపడవచ్చని చిత్తూరు జిల్లా కు చెందిన భార్యాభర్తలు ఆశపడ్డారు.
6.2 కిలోల గంజాయితో భార్యాభర్తలతో పాటు ముగ్గురి అరెస్టు
పలాస, మార్చి 6(ఆంధ్రజ్యోతి): తక్కువ ధరల కు గంజాయి కొనుగోలు చేసి అధిక ధరలకు విక్ర యించి జీవితంలో సుఖపడవచ్చని చిత్తూరు జిల్లా కు చెందిన భార్యాభర్తలు ఆశపడ్డారు. దీంతో మరో వ్యక్తి కలిసి వారిద్దరూ గంజాయి రవాణా చేస్తూ కాశీబుగ్గ పోలీసులకు శుక్రవారం పట్టుబడ్డారు. సీఐ వై.రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. చి త్తూరు జిల్లా గుండ్లపల్లి గ్రామానికి చెందిన రంబి ముణికుమార్, మింద్రకుర్తి నందిని భార్యాభర్తలు, నందిని సోదరుడు మింద్రకుర్తి రామకృష్ణ ముగ్గు రు కలసి మామిడికాయల వ్యాపారం చేసేవారు. ఈ క్రమంలో బరంపురం (ఒడిశా)లో కూడా మా మిడికాయలు సరఫరా చేసేవారు. అక్కడ ఆర్.ఉద యగిరి బ్లాక్, తలాడ గ్రామానికి చెందిన ప్రభోద్ చంద్రపాయక్ పరిచయం అయ్యాడు. మామిడికా యలు అమ్మితే ఎటువంటి లాభాలు ఉండవని, గంజాయి తీసుకొని అమ్మితే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పడంతో వారు ముగ్గురు అంగీకరించారు. ఈ క్రమంలో అనేక సార్లు గంజాయి విక్రయిఊ్త లాభాలు ఆర్జించారు. ఎప్పటిలాగే శుక్రవారం కూడా వారు 6.2 కిలోల గంజాయిని బ్యాగులో వేసుకుని పలాస రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కేందుకు రాగా ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న కాశీబుగ్గ ఎస్‌ఐ ఎన్.సునీల్‌కు వీరు ముగ్గురూ తారసపడ్డారు. వారిని ప్రశ్నించ డంతో గంజాయి ఉన్న బ్యాగులు విడిచి పరారీ అయ్యేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని బ్యాగులు పరిశీలిం చగా గంజాయి బయట పడింది. వారిని వెంటనే అరెస్టు చేసి గంజాయితో పాటు మూడు సెల్ ఫోన్లు, రూ.2490 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రామకృష్ణ తెలిపారు.