Share News

‘జీవనశైలిలో యోగా ఒక భాగం కావాలి’

ABN , Publish Date - Oct 12 , 2026 | 12:12 AM

మన జీవన శైలిలో యోగాను ఒక భాగంగా చేసుకోవాలని, తద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుందని ఆంధ్రా యూనివర్శిటీ ప్రొఫెసర్‌, యోగా గురువు గొలివి అప్పలనాయుడు అన్నారు.

‘జీవనశైలిలో యోగా ఒక భాగం కావాలి’
యోగా గురువు అప్పనాయుడును సత్కరిస్తున్న దృశ్యం

అరసవల్లి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): మన జీవన శైలిలో యోగాను ఒక భాగంగా చేసుకోవాలని, తద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుందని ఆంధ్రా యూనివర్శిటీ ప్రొఫెసర్‌, యోగా గురువు గొలివి అప్పలనాయుడు అన్నారు. స్టార్‌ వాకర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నగరంలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఆదివారం రిషి గాయత్రి యోగా పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుందన్నారు. యోగాసనాలు, శ్వాసకు సంబంధించిన అభ్యా సాలను సాధన చేయించారు. కార్య క్రమంలో క్లబ్‌ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్‌, లక్ష్మి, సుగంధం సంజీవరావు, ఎస్‌.జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 12 , 2026 | 12:12 AM