Share News

దేశాల మధ్య శాంతికి యోగా కీలకపాత్ర

ABN , Publish Date - Sep 25 , 2026 | 12:20 AM

ప్రపంచంలోని నేటి పరి స్థితుల నేపథ్యంలో దేశాల మధ్య ఘర్షణలు నివారించి శాంతి నెలకొ ల్పేందుకు యోగా కీలకపాత్ర పోషిస్తుందని పాటలీపుత్ర యూని వర్సిటీ (బీహార్‌) ప్రొఫెసర్‌ అభాసింగ్‌ అన్నారు.

దేశాల మధ్య శాంతికి యోగా కీలకపాత్ర
సదస్సులో మాట్లాడుతున్న ప్రొఫెసర్‌ అభాసింగ్‌

పాటలీపుత్ర యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అభాసింగ్‌

ఎచ్చెర్ల, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోని నేటి పరి స్థితుల నేపథ్యంలో దేశాల మధ్య ఘర్షణలు నివారించి శాంతి నెలకొ ల్పేందుకు యోగా కీలకపాత్ర పోషిస్తుందని పాటలీపుత్ర యూని వర్సిటీ (బీహార్‌) ప్రొఫెసర్‌ అభాసింగ్‌ అన్నారు. డా.బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో ‘శాంతి భిన్న సంస్కృతులు’ అంశంపై జరుగుతున్న అంత ర్జాతీయ సదస్సు గురువారం రెండో రోజు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రపంచశాంతికి ప్రతిఒక్కరూ పాటుపడాలన్నారు. ఎస్వీయూ పూర్వ ఆచార్యులు బి.సాంబశివప్రసాద్‌.. ప్రపంచశాంతికి ఎదురవుతున్న సవాళ్లపై ప్రముఖ తత్వవేత్త ప్రొఫెసర్‌ సచ్చిదానంద మూర్తి దృక్పథాన్ని విశ్లేషించారు. అలహాబాద్‌ యూనివర్సిటీ ఆచార్యు లు కె.భీమకుమార్‌ మాట్లాడుతూ.. విభిన్న సంస్కృతుల మధ్య సామ రస్యానికి బుద్ధుని శాంతి ప్రభోదాలు దిక్సూచిగా నిలుస్తాయన్నారు. ఈ సందర్భంగా 20 మంది పరిశోధకులు పరిశోధనా పత్రాలను సమర్పించారు. కార్యక్రమంలో వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ కేఆర్‌ రజని, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బి.అడ్డయ్య, ప్రిన్సి పాళ్లు ఎం.అనూరాధ, కె.స్వప్న వాహిని, సీహెచ్‌.రాజశేఖరరావు, సదస్సు కన్వీనర్లు ఎన్‌.సంతోష్‌ రంగనాథ్‌, టి.స్వప్నవాహిని తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 25 , 2026 | 12:20 AM