శాస్త్రీయ పద్ధతులతో దిగుబడులు: ఏడీఏ
ABN , Publish Date - Sep 09 , 2026 | 11:43 PM
వ్యవసాయంలో శాస్త్రీయ విధానాలు పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని ఏడీఏ బి.రజని సూచించారు.
ఆమదాలవలస, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయంలో శాస్త్రీయ విధానాలు పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని ఏడీఏ బి.రజని సూచించారు. సైలాడ రైతు సేవా కేంద్రంలో ఏటీఎంఏ ఆధ్వర్యంలో బుశారం రైతులకు శిక్షణ నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం ఏర్పడే అవకాశం ఉన్నందున తక్కువ నీటితో సాగు చేసే ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ పంట నమోదు, ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. శాస్త్రవేత్త డాక్టర్ జ్యోతి బస వరి పంటలో కలుపు, చీడపీడల నివారణపై సూచనలిచ్చారు. కార్యక్రమంలో ఏవోలు ఎల్ .విజయ, మెట్ట మోహన్‌రావు, బి.రవళి, రైతులు పాల్గొన్నారు.
ఇచ్ఛాపురం, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రైతు లు శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపడితే అఽధిక దిగు బడులు సాధించవచ్చని ఏవో అజయ్ సూచించారు. బుధవారం చిన్నలక్ష్మీపురం గ్రామంలో ఆత్మనిర్భర్ భారత్ 2026-27, పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా రాబోయే రబీ 2026-27 లో పప్పు ధాన్యాలు సాగు చేయాలన్నారు. మినుములు, పెసలు, శనగలు తదితర పప్పు ధాన్యా లను సాగు చేయటం ద్వారా పంటల వైవిధ్యంతో పాటు రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంద న్నారు. పప్పు ధాన్యాలు నేలలో నత్రజని స్ధిరీకరణకు సహాయపడడం ద్వారా నేల సారాన్ని పెంచి రసా యన ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు దోహ దపడుతుందన్నారు. రైతులు పాల్గొన్నారు.