Share News

నాడు మాక్‌ అసెంబ్లీలో.. నేడు ‘పది’ ఫలితాల్లో సత్తా

ABN , Publish Date - May 03 , 2026 | 12:08 AM

Government schools Students.. scored good marks రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలో గతేడాది నవంబరు 26న నిర్వహించిన మాక్‌ అసెంబ్లీలో ప్రతిభ చూపి న జిల్లా విద్యార్థులు.. తాజాగా విడుదలైన పదో తరగతి ఫలితాల్లోనూ సత్తా చాటారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్‌ అసెంబ్లీకి.. జిల్లా నుంచి పలువురు విద్యార్థులు హాజరయ్యారు.

నాడు మాక్‌ అసెంబ్లీలో..  నేడు ‘పది’ ఫలితాల్లో సత్తా
నవ్యశ్రీ, చంద్రలాస్య, ఆరాధ్య పాణీగ్రాహి, రష్మిక సంతోషి, భరత్‌సాయి

  • మంచి మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు

  • పలాస/ నరసన్నపేట/ కంచిలి, టెక్కలి, మే 2(ఆంధ్రజ్యోతి):

  • రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలో గతేడాది నవంబరు 26న నిర్వహించిన మాక్‌ అసెంబ్లీలో ప్రతిభ చూపి న జిల్లా విద్యార్థులు.. తాజాగా విడుదలైన పదో తరగతి ఫలితాల్లోనూ సత్తా చాటారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్‌ అసెంబ్లీకి.. జిల్లా నుంచి పలువురు విద్యార్థులు హాజరయ్యారు. ఇం దులో కాశీబుగ్గ జడ్పీ హైస్కూల్‌కు చెం దిన తమ్మినాన నవ్యశ్రీ(మందస మం డలం మఖరజోల) పదో తరగతి ఫలి తాల్లో 587 మార్కులు సాధించింది. ఇదే స్కూల్‌లో చదివిన రెడ్డి చంద్ర లాస్య (గాంధీనగర్‌)కు 586 మార్కులు వచ్చాయి.

  • టెక్కలి జిల్లాపరిషత్‌ బాలికోన్నత పాఠశాల ప్లస్‌కు చెందిన ఆర్‌.రష్మిక సంతోషి పదో తరగతి పరీక్షల్లో 585 మార్కులు సాధిం చింది. మేజర్‌పంచాయతీ శ్రీనివాస్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఈ విద్యార్థి తండ్రి గిరిధరరావు హోంగార్డు కాగా, తల్లి కోమలి గృహిణి. భవిష్యత్‌లో ఐఏఎస్‌ కావాలన్నదే తన లక్ష్యమని రష్మికసంతోషి తెలిపింది.

  • నరసన్నపేట మండలం కంబకాయి లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన వైశ్యరాజు భరత్‌సాయి పదో తరగతి ఫలితాల్లో 583 మార్కులు సాధించాడు. భరత్‌సాయి.. తండ్రి రాములు చిన్న కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. తల్లి నాగమణి గృహిణి. భవిష్యత్‌లో ఇంజనీరింగ్‌ పూర్తిచేసి.. సివిల్స్‌పై దృష్టి సారించనున్నట్టు భరత్‌సాయి తెలిపాడు.

  • అలాగే కంచిలి మండలం ఎం.ఎస్‌.పల్లి మోడల్‌ పాఠశాలకు చెందిన ఆరాధ్య పాణీగ్రాహి 569 మార్కులు సాధించింది. నాడు మాక్‌ అసెంబ్లీలో ఉత్తరాంధ్రలోని ప్రధాన సమస్యలపై ఈ విద్యార్థిని గళమె త్తింది. భవిష్యత్‌లో ఐఏఎస్‌ సాధనకు కృషి చేస్తానని ఆరాధ్య పాణీగ్రాహి తెలిపింది. కాగా నాడు అమరావతిలో మాక్‌ అసెంబ్లీలో పాల్గొన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు.. పదోతరగతి ఫలితాల్లోనూ ప్రతిభ చూపడంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 03 , 2026 | 12:08 AM