Share News

వైసీపీవి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు

ABN , Publish Date - May 17 , 2026 | 11:36 PM

తోటాడ- అక్కివరం పరిధిలోని భూములపై కొందరు వైసీపీ నాయకులు పన్నిన కుట్రలు, చేస్తున్న బ్లాక్‌ మెయి ల్‌ రాజకీయాలపై ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ భూ ములతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఒక్క అంగుళం భూమి ఆక్రమించినట్లు నిరూపించినా తాను ఏ శిక్షకైనా సిద్ధమేనని సవాల్‌ విసిరారు.

 వైసీపీవి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు
మాట్లాడుతున్న ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌

ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధం

ఎమ్మెల్యే కూన రవికుమార్‌

ఆమదాలవలస, మే 17(ఆంధ్రజ్యోతి): తోటాడ- అక్కివరం పరిధిలోని భూములపై కొందరు వైసీపీ నాయకులు పన్నిన కుట్రలు, చేస్తున్న బ్లాక్‌ మెయి ల్‌ రాజకీయాలపై ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ భూ ములతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఒక్క అంగుళం భూమి ఆక్రమించినట్లు నిరూపించినా తాను ఏ శిక్షకైనా సిద్ధమేనని సవాల్‌ విసిరారు. బావాజీ మఠం భూముల ప్రాంతానికి సమీపంలో ఆదివారం కొత్తరోడ్‌ వద్ద ఏర్పాటు చేసిన విలేక రులతో మాట్లాడుతూ.. వైసీపీ నేతల ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు తీర్పులు, కలెక్టర్‌ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ కాపీలను ఆయన మీడియాకు విడుదల చేశారు. కొత్తరోడ్డు జంక్షన్‌, అక్కివరం పంచాయతీ, తోటాడ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్‌ 121లో ఉన్న సుమారు 200 ఎకరాల భూమి జిరాయితీ భూమి అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తహసీల్దార్‌ నుంచి ల్యాండ్‌ ట్రిబ్యునల్‌ కౌన్సిల్‌, జిల్లా కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు అన్నీ ఇవి జిరాయితీ భూము లేనని ఽధ్రువీకరించాయన్నారు. అయినప్పటికీ కొంద రు వైసీపీ నాయకులు రాజకీయ కక్షతో, దోపిడీ ఆశతో రైతులను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తు న్నారని మండిపడ్డారు.

బావాజీ మఠం ప్రైవేట్‌ ఆస్తి..

బావాజీ మఠం భూములపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ‘ఇది దేవ దాయ శాఖకు చెందిన గుడి ఆస్తి కాదు. ములక్‌ దాస్‌ బావాజీ స్థాపించిన ప్రైవేట్‌ మఠం ఆస్తి. ప్రస్తుతం 12వ పీఠాధిపతి లక్ష్మీధర్‌ దాస్‌ బావాజీ ఆధీనంలో ఉంది. దేశం నలుమూ లల నుంచి వచ్చే స్వామీజీలకు వసతి కల్పించేందుకు తరత రాలుగా ఈ భూములు ఉపయోగపడుతున్నాయి. ఈ భూములు బావాజీ వ్యక్తిగత హక్కులలో భాగ మని సుప్రీంకోర్టే స్పష్టం చేసింది. ఈ భూములను అమ్ముకునే స్వేచ్ఛ ఆ యజమానులకే ఉం టుంది. ఎవరైనా కొనుక్కో వచ్చు. అమ్ముకోవచ్చు.. దానికీ నాకూ ఎలాంటి సంబంధం లేదు’ అని రవికుమార్‌ స్పష్టం చేశారు.

గూండాల్లా దాడి చేయిస్తున్నారు..

కొందరు వైసీపీ నేత లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యా పారులు కుమ్మక్కై రైతు లను, బావాజీని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని ఎమ్మెల్యే రవికుమార్‌ ఆరో పించారు. కోట్ల రూపా యల దందాల కోసం సామాన్య ప్రజలను వేధి స్తు న్నారని, గూండాలను పంపి ఇళ్లు నిర్మించుకుం టున్న వారిపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. తమ బంధువులు, రియల్‌ ఎస్టేట్‌ భాగస్వాముల ఆక్రమణలకు సహకరించ లేదనే అక్కసుతోనే వైసీపీ నేతలు అధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేస్తూ సైకో రాజకీయాలకు పాల్పడుతున్నారని విమ ర్శించారు.

ప్రజల కోరిక మేరకే రోడ్ల నిర్మాణం

కొత్తరోడ్డు ప్రాంతంలో వేసిన రోడ్లు తన సొంత లాభం కోసం వేయలేదని, స్థానిక ప్రజల ఇబ్బందులు, వారి లిఖిత పూర్వక వినతుల మేరకు రూ.40 లక్షలతో రోడ్ల నిర్మాణం చేపట్టామని అన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా గత ప్రభుత్వం చేయలేకపోయిన పనులను పూర్తి చేస్తున్నామని, సుమారు రూ.800 కోట్లతో 78 కిలోమీటర్ల మేర సీసీ, బీటీ రోడ్లను అభివృద్ధి చేశామని, అభివృద్ధిని అడ్డుకోవడానికి తప్పుడు ఆరోపణలు చేస్తున్నార న్నారు తాను ఎవరినైనా బెదిరించి భూములు తీసుకున్నానో లేదో అక్కడి రైతులనే అడగాలని సవాల్‌ విసిరారు. తోటాడ- అక్కివరం రైతులకు తాను పూర్తిగా అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. విశాఖపట్నం రెవెన్యూ సదస్సు లో సర్వే నెంబర్‌ 121 సమస్యను ప్రస్తావించి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సర్వేకి గెజిట్‌ తీసుకొ చ్చినట్లు తెలిపారు. త్వరలోనే నోటిఫికేషన్‌ వస్తుం దని, స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి ఏ నాయకు డూ చేయని విధంగా సర్వే చేయించి రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

30 ఏళ్లలో నాది స్వచ్ఛమైన చరిత్ర..

‘ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎక్కడా ఒక్క సెంటు భూమి కబ్జా చేసిన చరిత్ర లేదు. నా నీతి, నిజాయితీ ఏంటో నా నియోజకవర్గ ప్రజలకు తెలుసు. 420 రాజకీయాలు చేసి నా ఇమేజ్‌ డ్యా మేజ్‌ చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోను. వైసీపీ ఒక ఫేక్‌ పార్టీ అని ప్రజలకు అర్థమైపోయింది. ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరంగా, రాజకీయంగా తగిన గుణపాఠం చెబుతాం’ అని కూన రవికుమార్‌ హెచ్చరించారు. కార్యక్రమంలో బావాజీ మఠ పీఠాధిపతి లక్ష్మీదాస్‌ బాలాజీ, రాష్ట్ర కళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ తమ్మి నేని చంద్రశేఖర్‌, టీడీపీ నాయకులు హనుమంతు బాలకృష్ణ, బెండి రామ్మోహన్‌, తాండ్ర హరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2026 | 11:36 PM