పోర్టుపై మాట్లాడే హక్కు.. వైసీపీ నేతలకు లేదు
ABN , Publish Date - Mar 30 , 2026 | 12:20 AM
75 percent completed the port work మూలపేట పోర్టుపై మాట్లాడే హక్కు వైసీపీ నేతలకు లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం కోటబొమ్మాళిలో టీడీపీ ఆవిర్భావ దినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
అప్పట్లో 20 శాతం మాత్రమే
కూటమి పాలనలో 75 శాతం పనులు పూర్తిచేశాం
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి, మార్చి 29(ఆంధ్రజ్యోతి): మూలపేట పోర్టుపై మాట్లాడే హక్కు వైసీపీ నేతలకు లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం కోటబొమ్మాళిలో టీడీపీ ఆవిర్భావ దినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘టీడీపీ ప్రభుత్వ హయాంలో (2019లో) భావనపాడు పోర్టుకు శంకుస్థాపన చేసే సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో అర్థాంతరంగా ఆగిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భావనపాడులో పోర్టు నిర్మిస్తే టీడీపీకి పేరు వస్తుందనే దురాలోచనతో.. మూలపేటలో పోర్టుకు శంకుస్థాపన చేసింది. 20 శాతం పనులు మాత్రమే చేపట్టింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో పోర్టు పనులు చురుగ్గా సాగుతున్నాయి. 20 నెలల్లో 75 శాతం పనులు పూర్తిచేశాం. ఈ అభివృద్ధి చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మూలపేట పోర్టు సందర్శన పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నార’ని వైసీపీ నేతల తీరుపై మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ‘వైసీపీ హయాంలో అప్పటి మంత్రులు, నాయకుల గ్రామాలకు సైతం రోడ్లు వేసుకోలేకపోయారు. ప్రస్తుతం వాళ్ల గ్రామాలకు మనమే రోడ్లు వేస్తున్నాం. అటువంటి వారు కూటమి ప్రభుత్వంపై మాట్లాడడం విడ్డూరంగా ఉంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో వంశధార ప్రాజెక్టు పనులు 96 శాతం పూర్తిచేశాం. వైసీపీ.. ఆ మిగిలిన 4 శాతం పనులు కూడా పూర్తిచేయలేకపోయింది. వచ్చే జూన్ నాటికి రిజర్వాయర్ పనులు పూర్తిచేసి.. రెండు పంటలకు పుష్కలంగా సాగునీరు అందిస్తాం. 2029 నాటికి టెక్కలిని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామ’ని మంత్రి అచ్చెన్న స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం మండల పార్టీ అధ్యక్షులు బోయిన రమేష్, భీమారావు, బగాది శేషగిరి, పినకాన అంజయ్‌కుమార్, పీఏసీఎస్ అధ్యక్షురాలు వెలమల విజయలక్ష్మి, మాజీ ఎంపీపీ తర్ర రామకృష్ణ, టీడీపీ నేతలు కల్లి నాగయ్యరెడ్డి, లక్ష్మణరెడ్డి, కర్రి అప్పారావు, సాసుమంతు అనంద్, రెడ్డి అప్పన్న పాల్గొన్నారు.