వైసీపీ నాయకులది పిరికిపంద చర్య
ABN , Publish Date - Apr 09 , 2026 | 12:20 AM
‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయం పై వైసీపీ నాయకులు దాడులకు దిగడం పిరికిపంద చర్య అని టీడీ పీ జిల్లా అధికార ప్రతినిధి బూర్లె లలితకుమారి తెలిపారు.
టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి లలితకుమారి
మెళియాపుట్టి, ఏప్రిల్ 8 (ఆంధ్ర జ్యోతి): ‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయం పై వైసీపీ నాయకులు దాడులకు దిగడం పిరికిపంద చర్య అని టీడీ పీ జిల్లా అధికార ప్రతినిధి బూర్లె లలితకుమారి తెలిపారు. బుధ వారం ఆమె విలేకరులతో మాట్లా డుతూ.. ఆంధ్రజ్యోతి పార్టీలకు అతీతంగా వార్తలు రాస్తుందన్నారు. జగన్‌రెడ్డికి చెందిన సాక్షిలో టీడీపీ మహిళలపై రాస్తున్న రాతలతో ఆ పత్రికా కార్యాలయాల ముందు ధర్నాలు చేయాల్సి వస్తుందన్నా రు. అమరావతి రాజధాని ఇష్టం లేకే గొడవలు సృష్టించడానికి వైసీపీ నాయకులు ఎత్తుగడలు వేస్తున్నారని విమర్శించారు. నిజాలు రాస్తే దాడులకు దిగి గూండా యిజం చేస్తుండడం సరైన విధానం కాద న్నారు. టీడీపీ నాయకులు శేషి తిరుపతిరావు పాల్గొన్నారు.