Share News

వైసీపీ ఫ్లాప్‌ షో

ABN , Publish Date - Apr 09 , 2026 | 12:18 AM

ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ధర్నా చేస్తామంటూ రెండు రోజులుగా వైసీపీ నాయకులు హడా వుడి చేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి ధర్మాన కృష్ణ దాస్‌ ఈ మేరకు ఓ ప్రకటన ఇచ్చారు. ప్రతి మండలం నుంచి మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలంటూ పిలుపు నిచ్చారు. కానీ బుధవారం సాయంత్రం నిరసన కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా కేవలం 60 మంది హాజరయ్యారు. దీంతో ఆ పార్టీ కార్యక్ర మం ఫ్లాప్‌ షో అయింది.

వైసీపీ ఫ్లాప్‌ షో
ఇలా కాసేపు నిలబడి వెళ్లిపోయారు..

ఆంధ్రజ్యోతి ఆఫీసు వద్ద నిరసన అంటూ హడావుడి

క్యాడర్‌ రావాలంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం

జిల్లా వ్యాప్తంగా 60 మంది మాత్రమే హాజరు

శ్రీకాకుళం, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ధర్నా చేస్తామంటూ రెండు రోజులుగా వైసీపీ నాయకులు హడా వుడి చేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి ధర్మాన కృష్ణ దాస్‌ ఈ మేరకు ఓ ప్రకటన ఇచ్చారు. ప్రతి మండలం నుంచి మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలంటూ పిలుపు నిచ్చారు. కానీ బుధవారం సాయంత్రం నిరసన కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా కేవలం 60 మంది హాజరయ్యారు. దీంతో ఆ పార్టీ కార్యక్ర మం ఫ్లాప్‌ షో అయింది. తొలుత ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ కొంతమంది అను చరులను వెంటేసుకుని వచ్చి కాసేపు హడావుడి చేసి వెళ్లిపోయారు. ఆతర్వాత పోలాకి మండల జడ్పీటీసీ ధర్మాన కృష్ణచైతన్య కొద్దిమంది అను చరులతో వచ్చి ఆఫీసు ఎదుట ఆందోళన చేసేం దుకు యత్నించారు. శాంతియుతంగా నిరసన చేసుకోవాలని, 30 పోలీసుయాక్ట్‌ అమల్లో ఉంద ని పోలీసులు వారికి చెప్పారు. దీంతో వైసీపీ నాయకులు రోడ్డు ఆవలివైపు ఓ ఐదు నిమిషా లు హడావుడి చేసి వెళ్లిపోయారు. మరోవిడత కొందరు వచ్చి రెండు నిమిషాలు ఉండి వెళ్లిపో యారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద, సర్కిల్‌ ఇన్‌ స్పెక్టర్‌ అవతారం, ప్రత్యేక పోలీసు బలగాలు మోహరించారు. సాధారణ ప్రజలకు ఇక్కట్లు లేకుండా చర్యలు తీసుకున్నారు. వైసీపీ కింది స్థాయి కార్యకర్తలు ఒకరిద్దరు పోలీసులతో వాగ్వాదానికి దిగినా సహనం కోల్పోకుండా సంయమనంతో వ్యవహరించారు.

Updated Date - Apr 09 , 2026 | 12:18 AM