నేరడి బ్యారేజీపై వైసీపీ దృష్టి పెట్టలేదు
ABN , Publish Date - Apr 06 , 2026 | 11:39 PM
ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వ హయాంలో నేరడి బ్యారేజీ అంశం గాలికొదిలేశారని, ఇప్పుడు వైసీపీ నాయకులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సోమవారం నౌపడా మూడురోడ్లు జంక్షన్‌లో సింకుఒడ్డు చెరువు వద్ద నీటిభద్రత సాగునీటి సంఘాల బాధ్యత పనులను ప్రారంభించారు.
టెక్కలి/సంతబొమ్మాళి, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వ హయాంలో నేరడి బ్యారేజీ అంశం గాలికొదిలేశారని, ఇప్పుడు వైసీపీ నాయకులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సోమవారం నౌపడా మూడురోడ్లు జంక్షన్‌లో సింకుఒడ్డు చెరువు వద్ద నీటిభద్రత సాగునీటి సంఘాల బాధ్యత పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా ఆంధ్రా, ఒడిశాల మధ్య నేరడి బ్యారేజీ నిర్మాణం కోసం ట్రిబ్యునల్‌లో ఉన్నా వైసీపీ పాలకులు కనీసం దృష్టి పెట్టలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లోనే ట్రిబ్యునల్‌పై అవసరమైన న్యాయవాదులను పెట్టి సమస్య వివరించి విజయం సాధించామన్నారు. అదే వైసీపీ ప్రభుత్వమైతే అధికా రంలో ఉన్నన్నాళ్లు ఏపని చేస్తే డబ్బులు వస్తాయి, ఏ పనిచేస్తే లంచాలు తినవచ్చు అన్నవాటిపై దృష్టి పెట్టారని ఆరోపించారు. నేరేడి బ్యారేజీ నిర్మాణం పూర్తయితే వైసీపీ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన లిఫ్ట్‌ఇరిగేషన్ ఎందుకూ పనికిరాకుండా పోతుందన్నారు. ఈ లిఫ్ట్‌ఇరిగేషన్ కాంట్రాక్ట్ పనులు సైతం ఓ వైసీపీ ఎంపీకి కట్ట బెట్టారని ధ్వజమెత్తారు. వైసీపీ నాయకుల్లా కమీషన్లకు కక్కుర్తిపడే అలవాటు మాకు లేదన్నారు. 2014-19 మధ్యకాలంలో వంశఽధార రిజర్వాయర్ 96శాతం పనులు పూర్తిచేశామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, డుమా పీడీ లవరాజు, వంశధార ఎస్‌ఈ జి.రామచంద్రరావు, ఇరిగేషన్ ఎస్‌ఈ పి.సుధాకర్, డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, మార్కెట్ కమిటీ అధ్యక్షులు బగాది శేషగిరి, టీడీపీ మండలాధ్యక్షులు సుగ్గు స్వరూపరెడ్డి, పినకాన అజయ్‌కుమార్, రెడ్డి అప్పన్న, జీరు భీమారావు, సనపల మురళి పాల్గొన్నారు.