వరి సాగుపై ప్రభుత్వానికి నివేదిక
ABN , Publish Date - Aug 02 , 2026 | 12:00 AM
: జిల్లాలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యం లో వరి సాగు పరిస్థితిని ప్రభుత్వానికి ని
వజ్రపుకొత్తూరు, ఆగస్టు1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యం లో వరి సాగు పరిస్థితిని ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ పీవీ సత్యనారాయణ తెలిపారు. శనివారం మండలంలోని బెండి గ్రామ పరిసరాల్లోని పంటపొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. వర్షాభావ పరిస్థితుల వల్ల వరి పంట తీవ్రంగా దెబ్బతిందని, చాలాప్రాంతాల్లో నాట్లు కూడా వేయలేదని రైతులు తెలిపారు. ప్రసుతం వాడుతున్న వరి విత్తనాలు, ఎరువులపై ఆరాతీశారు. వర్షాలు తక్కువుగా ఉన్న సమయంలో వేయాల్సిన పంటల గురించి వివరించారు. ప్రస్తుతం వరిపంట పరిస్థితిని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. వర్షాభా వంతో వరిపంటపై ఎటువంటి ప్రభావం ఉందో ప్రభుత్వానికి వివరిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి వైవీ మురళీకృష్ణ, ఏవో బి.ధనుంజయ, వ్యవ సాయశాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
శాస్త్రవేత్తలతో పరిశీలన
నందిగాం, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): పంటల పరిస్థితులపై ప్రభుత్వం దృష్టికి తీసు కువెళ్లామని ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ పీవీ సత్యనారాయణ తెలిపారు. శనివారం నందిగాంలో పంటల స్థితిగతులపై జిల్లా వ్యవసాయశాఖ ఏడీ మురళీకృష్ణ శాస్త్రవేత్తలతో కలిపి పరిశీలించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులతో నెలకొన్న పంటల స్థితిగతులపై కృషివిజ్ఞాన్ కేంద్రాలు, వ్యవసాయ పరిశోధన కేంద్రాల శాస్త్రవేత్తలతో రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇచ్ఛాపురం, సోంపేట, కంచిలి, వజ్రపుకొత్తూరు, నందిగాం తదితర మండలాల్లో బృందం పరిశీలించిందని చెప్పారు. రానున్న నాలుగైదు రోజుల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయన్నారు. ఏవో పి.శ్రీకాంత్‌వర్మ నుంచి మండలంలో సాగు వివరాలు, ఎదలు, ఉబాలు తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట శాస్త్రవేత్తలు డాక్టర్ శ్రీనివాస్, చిట్టిబాబు, భాగ్యలక్ష్మి, రోయ్, హరికు మార్, ఆత్మ పీడీ జగన్మోహనరావు ఉన్నారు.