మట్టి వినాయకులను పూజించండి: రామ్మోహన్
ABN , Publish Date - Sep 12 , 2026 | 12:29 AM
పర్యావరణహిత మైన మట్టి గణేషుని విగ్ర హాలకు పూజించాలని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
శ్రీకాకుళం అర్బన్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): పర్యావరణహిత మైన మట్టి గణేషుని విగ్ర హాలకు పూజించాలని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మం డలి ఆధ్వర్యంలో రూపొం దించిన పోస్టర్లను శుక్ర వారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీవోపీతో తయారు చేసిన విగ్రహాల వల్ల నీటివనరులు పాడవడంతో పాటు పర్యావరణానికి విఘాతం కలుగు తుందన్నారు. కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ కరుణ శ్రీ మాట్లాడుతూ.. కాలుష్య నియంత్రణలో ప్రతిఒక్కరూ భాగస్వా ములు కావాలన్నారు. అనంతరం జ్యూట్ బ్యాగ్‌లను పంపిణీ చేశారు. విద్యార్థుల తో మట్టి గణపతి ప్రతిమలను తయారు చేయించి బహుమతులు ఇచ్చా రు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్ తదితరులు పాల్గొన్నారు.