Share News

ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం

ABN , Publish Date - Jun 15 , 2026 | 12:07 AM

ప్రపంచ రక్తదాత ల దినోత్సవాన్ని ఆది వారం నిర్వహించారు. టెక్కలి, రణ స్థలం, ఆముదాలవలసల్లో కూడా రక్త దాన శిబిరాలను నిర్వహించి రక్తదాతలను అభినందించారు.

ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం
రణస్థలంలో రక్తదానం చేస్తున్న యువత

అరసవల్లి, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): ప్రపంచ రక్తదాత ల దినోత్సవాన్ని ఆది వారం నిర్వహించారు. టెక్కలి, రణ స్థలం, ఆముదాలవలసల్లో కూడా రక్త దాన శిబిరాలను నిర్వహించి రక్తదాతలను అభినందించారు. కార్య క్రమం లో రెడ్‌ క్రాస్‌ జిల్లా చైర్మన్‌ జగన్మోహన్‌రావు, కార్యదర్శి బలివాడ మల్లేశ్వరరావు, ప్రతినిధులు సత్యనారాయణ, కె.శ్రీనివా సరావు, పెంకి చైతన్యకుమార్‌, జి.రమణ, ఎన్‌. హర్షవర్థన్‌ తదితరులు పాల్గొన్నారు.

‘రక్తదానానికి ముందుకు రండి’

ఇచ్ఛాపురం/కంచిలి/రణస్థలం, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ రక్తదాన శిబిరాలను ఇచ్ఛాపురం, కంచిలి, రణస్థలంలో ఆదివారం నిర్వహించారు. ఇచ్ఛాపురం జేసీ ఐ, రణస్థలం మండల కేంద్రంలోని సేవా ఫౌండేషన్‌, కంచిలిలో ఉద్దానం బ్లడ్‌బ్యాంక్‌ సౌజన్యంతో సీతయ్య అనాథాశ్రమం ఆధ్వర్యంలో రక్తదానం చేశారు. రక్తదానం చేసేందుకు యువకులు ముందుకు రావాలని అతిథులు కోరారు. పలువురు యువకులు రక్తదానం చేశారు. వారిని సంస్థల నిర్వాహకులు అభినందించారు.

Updated Date - Jun 15 , 2026 | 12:07 AM