Share News

స్వర్ణ గ్రామ ఉద్యోగులపై పనిభారం తగ్గించాలి

ABN , Publish Date - Aug 22 , 2026 | 11:25 PM

స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగులపై పనిభారం తగ్గించాలని, బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మృతి చెందిన మండపల్లి స్వర్ణ గ్రామ డిజిటల్‌ అసిస్టెంట్‌ రౌతు మెహర్‌ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు.

స్వర్ణ గ్రామ ఉద్యోగులపై పనిభారం తగ్గించాలి
నిరసన తెలుపుతున్న స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగులు

- సంఘ నాయకుల డిమాండ్‌

- ఇచ్ఛాపురంలో నిరసన

ఇచ్ఛాపురం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగులపై పనిభారం తగ్గించాలని, బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మృతి చెందిన మండపల్లి స్వర్ణ గ్రామ డిజిటల్‌ అసిస్టెంట్‌ రౌతు మెహర్‌ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాల వద్ద శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఒకే ఉద్యోగిపై నాలుగు రకాల కీలక బాధ్యతలు మోపడంతో తీవ్ర పని ఒత్తిడి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పని ఒత్తిడి కార ణంగానే మెహర్‌ మృతి చెందాడన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మెహర్‌ కుటుం బాన్ని ఆదుకోవాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాల సూపరింటెండెట్లకు వినతిపత్రాలు అందించారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర స్వర్ణ గ్రామ, వార్డు సంఘం జేసీఐ కోఆర్డినేటర్‌ కూన వెంకట సత్యనారాయణ, ఏఎస్‌ఈ స్టేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ ఫరూక్‌, జేఏసీ జిల్లా కోఆర్డినేటర్లు జయకృష్ణ, పొల్లాయి అశోక్‌, విజయకుమారి, అబ్దుల్‌, సర్వేశ్వర్‌, రవిబాబు, వాసుదేవ్‌, సూర్యకుమారి, ప్రదీప్‌, సునీల్‌, మీనాక్షి, నీరజ, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2026 | 11:25 PM