Share News

‘హెల్త్‌ సెక్రటరీలపై పనిఒత్తిడి తగ్గించాలి’

ABN , Publish Date - Mar 09 , 2026 | 11:55 PM

హెల్త్‌ సెక్రటరీలకు పని ఒత్తిడి తగ్గించాలని, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన పనులకు మాత్రమే వినియోగించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వ రరావు డిమాండ్‌ చేశారు.

‘హెల్త్‌ సెక్రటరీలపై పనిఒత్తిడి తగ్గించాలి’
వైద్యఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద ధర్నాచేస్తున్న హెల్త్‌ సెక్రటరీలు:

అరసవల్లి, మార్చి 9(ఆంధ్రజ్యోతి): హెల్త్‌ సెక్రటరీలకు పని ఒత్తిడి తగ్గించాలని, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన పనులకు మాత్రమే వినియోగించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వ రరావు డిమాండ్‌ చేశారు. సోమవారం శ్రీకాకుళంలోని జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం వద్ద యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు మాలతి, చందు, సాయిప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 09 , 2026 | 11:55 PM