గ్రంఽథాలయాల అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:18 AM
గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని శ్రీకాకుళం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరుకట్ల విఠల్‌రావు తెలి పారు.ఈమేరకు శ్రీకాకుళంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో చైర్మన్ గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
శ్రీకాకుళం లీగల్, జనవరి12 (ఆంధ్రజ్యోతి): గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని శ్రీకాకుళం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరుకట్ల విఠల్‌రావు తెలి పారు.ఈమేరకు శ్రీకాకుళంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో చైర్మన్ గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పలు దస్త్రాలపై సంతకాలు చేశారు. జిల్లాలోని గ్రంఽథాలయాల తాజా పరిస్థితులపై వివరాలు అడిగితెలుసు కున్నారు. స్వామీ వివేకానంద జయంతి సందర్భంగా వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసినివాళులర్పించారు. కార్యక్రమంలో గ్రంఽథాలయ సంస్థ కార్యదర్శి శంకరరావు,ఉద్యోగులు పాల్గొన్నారు.అనంతరం పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, సన్నిహితులు ఆయనకు శుభాకాంక్షలు తెలియచేశారు