Share News

కలసికట్టుగా విజయానికి కృషి

ABN , Publish Date - Oct 16 , 2026 | 12:37 AM

ప్రజాస్వామ్య బద్ధంగా స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయఢంకా మోగించడానికి కలిసికట్టుగా పని చేయాలని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

కలసికట్టుగా విజయానికి కృషి

నందిగాం, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్య బద్ధంగా స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయఢంకా మోగించడానికి కలిసికట్టుగా పని చేయాలని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక కల్యాణ మండపంలో మండల టీడీపీ అధ్యక్షులు పినకాన జోగారావు అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అచ్చెన్నాయుడు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వైసీపీ పాలనలో స్థానిక ఎన్నికలను అపహాస్యం చేశారని.. మనం ప్రజాస్వామ్యబద్ధంగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి నూటికి నూరు శాతం స్థానాలు గెలిపించుకుందామన్నారు. నందిగాం మండలంలో తెలుగుదేశం పాగా వేసేలా ప్రతి కార్యకర్త పని చేయాలన్నారు. న్యాయం, ఎవరైనా తోకజాడిస్తే కత్తిరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకురాలు, రాష్ట్ర కార్యదర్శి బి.దమయంతి, పినకాన అజయ్‌కుమార్‌, పోలాకి చంద్రశేఖర్‌, మళ్ల బాలకృష్ణ, ఎస్‌.జానకిరాం, ఎం.లోకనాథం, బి.గిరిబాబు, టి.మహేష్‌, కె.హరిబాబు, తాతయ్య, ధర్మారావు, ఎం.మోహనరావు, ఎ.సుదర్శనరావు, కె.విశ్వనాథం, ఎం.సింహాచలం, వి.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

టీడీపీలో చేరిక

మొండ్రాయివలస పంచాయతీ సుబ్బమ్మ పేట, ఆకులరఘునాథపురానికి చెందిన పలువురు మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. మండల పార్టీ అధ్యక్షులు పినకాన జోగారావు నేతృత్వంలో ఆ గ్రామాలకు చెందిన పల్ల అంతరి, మండె హరి, నర్సిపురం కామేసు, మాదు ధర్మారావు, నీలాపు కృష్ణారావు, పెద్దింటి సీతయ్య తదితరులు పార్టీలో చేరారు. వారికి మంత్రి వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ అభివృద్ధికి, అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు.

Updated Date - Oct 16 , 2026 | 12:37 AM