Share News

పేదల అభ్యున్నతికి కృషి

ABN , Publish Date - Mar 10 , 2026 | 11:56 PM

రాజకీయాలకతీతంగా లబ్ధిదారులకు సీఎం సహాయనిధి అందించి పేదలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.

 పేదల అభ్యున్నతికి కృషి
సీఎం సహాయనిధి చెక్కును అందజేస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు:

కోటబొమ్మాళి, మార్చి 10(ఆంధ్రజ్యోతి): రాజకీయాలకతీతంగా లబ్ధిదారులకు సీఎం సహాయనిధి అందించి పేదలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పేదల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరంత రం కృషి చేస్తున్నారని చెప్పారు. మంగళవారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో తొమ్మిది మందికి రూ. 7.50లక్షలు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. తొలుత తన క్యాంపు కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రజాదర్భార్‌ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కాగా కోటబొమ్మాళి ఏఎంసీ భవనం ఆధునికీకరణతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి రూ. 3.20కోట్లు మంజూరుకావడంతో ఏఎంసీ చైర్మన్‌ బగాది శేషగిరి, సభ్యులు క్యాంపు కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు సన్మానించారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. వివరించారు. ఈ కార్యక్రమాల్లో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌, టీడీపీ నాయకులు పినకాన అజయ్‌కుమార్‌, బాలకృష్ణ, నాళ్ళ ఆదినారాయణ, పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్‌, పీఏసీఎస్‌ అధ్యక్షురాలు వెలమల విజయలక్ష్మి, వెలమల కామేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Mar 10 , 2026 | 11:56 PM