Share News

ప్రజా సంక్షేమానికి కృషి: ఎంపీ కలిశెట్టి

ABN , Publish Date - Feb 08 , 2026 | 11:42 PM

ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్ప లనాయుడు అన్నారు.

ప్రజా సంక్షేమానికి కృషి: ఎంపీ కలిశెట్టి
ప్రజా సమస్యలను తెలుసుకుంటున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

జి.సిగడాం, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్ప లనాయుడు అన్నారు. ఆదివారం గెడ్డకంచరాంలో రామదేవుని సంబరాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలో పర్యటించి స్థానికుల నుంచి సమ స్యలను అడిగి తెలుసుకు న్నారు. విజన్‌ ఉన్న నాయకుడు, ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించి అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. 2047 వికసిత్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దే సంకల్పం తో ముందుకు వెళుతున్నారన్నారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అన్నారు. పార్టీకోసం కష్టపడిన వారికి ఎప్పుడూ తగిన గుర్తింపు ఉంటుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపే లక్ష్యంగా ప్రతీ ఒక్క కార్యకర్త పనిచేయాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అద్యక్షుడు కుమరాపు రవికుమా ర్‌, పీఏసీఎస్‌ అధ్యక్షుడు నక్క మురళి, కూటమి నేతలు బగ్గు జ్ఞానేశ్వరరావు, పంచిరెడ్డి శ్యామల రావు, మీసాల రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 08 , 2026 | 11:42 PM