Share News

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Jun 02 , 2026 | 11:32 PM

ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమ స్యలు పరిష్కరించాలని ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షుడు ఎంఏ రాజు, కార్యదర్శి ఎటి.కుమార్‌ కోరారు.

 కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ధర్నా నిర్వహిస్తున్న ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు

పలాస, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమ స్యలు పరిష్కరించాలని ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షుడు ఎంఏ రాజు, కార్యదర్శి ఎటి.కుమార్‌ కోరారు. మంగళవారం పలాస ఆర్టీసీ డిపో కార్యా లయం వద్ద ఈయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కార్మికులకు సౌకర్యాలు కల్పించాలని, కొత్తబస్సులు వేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కార్మికసంఘ నాయకులు జీకే రాజు, డీజీ రాజు, కేఎస్‌.రావు, ఆర్‌ఆర్‌ రావు, బి.మురళీధర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2026 | 11:32 PM