కార్మికుల భద్రతకు ప్రాధాన్యం
ABN , Publish Date - Apr 09 , 2026 | 10:52 PM
Industries are essential for the development దేశాభిృద్ధికి దోహదపడే పరిశ్రమలను.. కార్మికుల భద్రతే ప్రామాణిక లక్ష్యంగా నిర్వహించాలని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఎచ్చెర్ల మండలం అరిణాం అక్కివలసలోని నాగార్జున అగ్రికమ్ కెమికల్ లిమిటెడ్ (ఎన్‌ఏసీఎల్)లో గురువారం నిర్వహించిన 55వ జాతీయ భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
దేశాభివృద్ధికి పరిశ్రమలు ఎంతో అవసరం
కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్
ఎచ్చెర్ల/రణస్థలం, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): దేశాభిృద్ధికి దోహదపడే పరిశ్రమలను.. కార్మికుల భద్రతే ప్రామాణిక లక్ష్యంగా నిర్వహించాలని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఎచ్చెర్ల మండలం అరిణాం అక్కివలసలోని నాగార్జున అగ్రికమ్ కెమికల్ లిమిటెడ్ (ఎన్‌ఏసీఎల్)లో గురువారం నిర్వహించిన 55వ జాతీయ భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘గత వైసీపీ ప్రభుత్వం కార్మికుల భద్రతను గాలికొదిలేసింది. దీనివల్ల పరిశ్రమల్లో నష్టం జరిగింది. కార్మికుల భద్రతతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్రంలో కార్మికుల సంక్షేమం కోసం 7 ఈఎస్‌ఐ ఆసుపత్రులు, 23 డిస్పెన్షరీల ఏర్పాటుకు ఆమోదించింది. జాతీయ భద్రతా దినోత్సవం ఒక సాధారణ వేడుక మాత్రమే కాదు. ఇది మనందరి భద్రతపై అవగాహన పెంచే ఒక జాతీయ ఉద్యమం. ఎన్‌ఏసీఎల్ పరిశ్రమ పర్యావరణ పరిరక్షణ, భద్రత ప్రమాణాలు పాటించడంలో పలు జాతీయ అవార్డులు పొందడం అభినందనీయం. అసంఘటిత కార్మికులు ఈశ్రమ్ పోర్టల్‌లో వివరాలను నమోదు చేసుకోవాల’ని మంత్రి సుభాష్ సూచించారు. రానున్న మూడేళ్లలో మూడు లక్షల మందికి పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు.
ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు మాట్లాడుతూ ‘పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగాల కల్పనతోపాటు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. పదవీ విరమణ పొందిన వారి స్థానంలో.. వారి పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి. సీఎస్‌ఆర్ స్కీమ్ ద్వారా పరిసర గ్రామాల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాల’ని కోరారు. అలాగే రెడ్డీస్‌ల్యాబ్ పరిశ్రమలోని బాయిలర్స్‌ను మంత్రి సుభాష్, ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు పరిశీలించారు. పరిశ్రమల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రికి ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహమ్మద్ ఖాన్, ఆర్డీవో కె.సాయిప్రత్యూష, పరిశ్రమల శాఖ జాయింట్ ఛీప్ ఇన్ ్సపెక్టర్ జె.శివశంకరెడ్డి, డిప్యూటీ ఛీప్ ఇన్‌స్పెక్టర్ బి.రాంబాబు, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ అజయ్ కార్తికేయ, ఎన్‌ఏసీఎల్ పరిశ్రమ యూనిట్ హెడ్ కేవీఎస్ సురేష్, హెచ్‌పీడీ జీఎం కె.శ్యామ్‌ప్రసాద్, సీఎస్‌ఆర్ హెడ్ పీఎస్‌వీఎస్‌ఎన్ వర్మ, సేఫ్టీ హెడ్ వెంకటరాజు, రెడ్డీస్ ల్యాబ్ పరిశ్రమ ప్రతినిధులు జోగారావు, దీపక్, కూటమి నేతలు చౌదరి బాబ్జి, అవినాష్, ముప్పిడి సురేష్, డీజీఎం ఆనందరావు, పిషిని జగన్నాఽథం నాయుడు పాల్గొన్నారు.