చికిత్స పొందుతూ కార్మికుడి మృతి
ABN , Publish Date - Apr 10 , 2026 | 12:10 AM
జి.సిగడాం మండలం చెట్టుపొదిలాం గ్రామానికి చెందిన టొంపల ఆనందరావు (55) విశాఖలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు.
లావేరు, ఏప్రిల్ 9(ఆంఽధ్రజ్యోతి): జి.సిగడాం మండలం చెట్టుపొదిలాం గ్రామానికి చెందిన టొంపల ఆనందరావు (55) విశాఖలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పొందూరులోని ఓ సిమెంట్ షాపులో కార్మికుడిగా ఆనందరావు పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల 30న ఆయన పొందూరు నుంచి లావేరు మండలంలోని గుర్రాలపాలెం గ్రామానికి లారీతో సిమెంట్ లోడును తీసుకువచ్చారు. సిమెంట్ దించుతుండగా ప్రమాదవశాత్తు జారిపడి కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆనందరావును చికిత్స నిమిత్తంగా తొలుత శ్రీకాకుళం రిమ్స్‌కు.. అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. లావేరు ఏఎస్‌ఐ ఎం.రాజారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆనందరావుకు భార్య పిల్లలు ఉన్నారు.